IPL 2023: అప్పుడు ఇటుకలు, సిమెంట్ బస్తాలు మోశాడు.. ఇప్పుడు ఐపీఎల్‌లో దుమ్ము రేపుతున్నాడు.. 4 కోట్లకు సరైన న్యాయం
హిందీలో వచ్చిన 'ఇక్బాల్’ సినిమా చూశారా? అందులో హీరోగా నటించిన శ్రేయాస్ తల్పాడే టీమిండియా జట్టులోకి అడుగుపెట్టాలనుకుంటాడు. అందుకోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. పేదరికం, కుటుంబ సమస్యలను అన్నింటినీ దాటుకుని చివరకు సక్సెస్‌ఫుల్ భారత బౌలర్‌గా ఎదుగుతాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో అదరగొడుతోన్న రవి బిష్ణోయ్ జీవితం కూడా సేమ్ ఇలాంటిదే.

హిందీలో వచ్చిన ‘ఇక్బాల్’ సినిమా చూశారా? అందులో హీరోగా నటించిన శ్రేయాస్ తల్పాడే టీమిండియా జట్టులోకి అడుగుపెట్టాలనుకుంటాడు. అందుకోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. పేదరికం, కుటుంబ సమస్యలను అన్నింటినీ దాటుకుని చివరకు సక్సెస్‌ఫుల్ భారత బౌలర్‌గా ఎదుగుతాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో అదరగొడుతోన్న రవి బిష్ణోయ్ జీవితం కూడా సేమ్ ఇలాంటిదే. ఇప్పటికే టీమిండియాలో అడుగుపెట్టిన అతను ప ప్రస్తుత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లకు కళ్లెం వేస్తున్నాడు. లక్నో విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే తాను ఈ స్థాయికి రావడం వెనక ఎన్నో కన్నీటి కష్టాలున్నాయంటున్నాడు రవి బిష్ణోయ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతను తన జీవితంలోని గడ్డు పరిస్థితులను అందరితో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం తన స్పిన్ బౌలింగ్‌తో బ్యాటర్లకు మూకుతాడు వేస్తోన్న రవి చిన్నప్పుడు కూలి పనులకు వెళ్లాడట. 12 ఏళ్ల వయసులోనే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్న అతను తన కలను సాకారం చేసుకునేందుకు ఇటుకలు, సిమెంట్ బస్తాలు మోశాడట.
బోర్డు పరీక్షలకు డుమ్మా కొట్టా..
‘2018లో నాకు రాజస్తాన్ రాయల్స్ నెట్ బౌలర్‌గా ఛాన్స్ వచ్చింది. అదే సమయంలో 12వ తరగతి బోర్డు పరీక్షలు. కానీ క్రికెట్‌పై ఉన్న ప్రేమ ఆ ఏడాది నన్ను బోర్డు పరీక్షలకు దూరం చేసింది. దీంతో వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడైన నాన్న నన్ను వెనక్కి రమ్మన్నారు. అదే సమయంలో రాజస్తాన్ బౌలింగ్ కోచ్ క్యాంప్‌లోనే నన్ను ఉండమన్నారు. దీంతో ఆ ఏడాది 12వ తరగతి బోర్డ్ పరీక్షలను వదులుకుని మరీ నెట్ బౌలర్‌గా సేవలందించా. ఇక ఇంటికి వచ్చిన తర్వాత నాన్నను ఒప్పించడం చాలా కష్టమైంది. క్రికెట్‌పై ఉన్న ఆసక్తితో నేను మరికొంతమందితో కలిసి జోధ్‌పూర్‌లో క్రికెట్ అకాడమీని ప్రారంభించాం. అయితే ఆ అకాడమీలో పిచ్ కూడా లేదు. కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో నా స్నేహితులతో కలిసి కూలి పనులకు వెళ్లాం. ఇటుకలు, సిమెంట్ బస్తాలు మోసి దాని ద్వారా వచ్చిన డబ్బులతో క్రికెట్ పిచ్‌ను తయారుచేసుకున్నాం’ అని అప్పటి అనుభవాలను పంచుకున్నాడు బిష్ణోయ్. కాగా ఐపీఎల్ వేలంలో రూ.4 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ రవి బిష్ణోయ్‌ను కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 5 మ్యాచుల్లో మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు.




View this post on Instagram
View this post on Instagram
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..
