AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs GT: ఐపీఎల్‌ మధ్యలో తండ్రి మరణం.. మూడేళ్లు క్రికెట్‌కు దూరం.. కట్‌ చేస్తే సూపర్‌స్పెల్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన ధోని ఫ్రెండ్‌

మోహిత్‌ చివరిగా 2020 ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున బరిలోకి దిగాడు. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 45 పరుగులిచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు. అయితే ఆ సీజన్‌ మధ్యలోనే మోహిత్‌ తండ్రి కన్నుమూశారు. దీంతో ఐపీఎల్‌ను మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది.

PBKS vs GT: ఐపీఎల్‌ మధ్యలో తండ్రి మరణం.. మూడేళ్లు క్రికెట్‌కు దూరం.. కట్‌ చేస్తే సూపర్‌స్పెల్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన ధోని ఫ్రెండ్‌
Gujarat Titans against Punjab Kings
Basha Shek
|

Updated on: Apr 14, 2023 | 10:35 AM

Share

టీమిండియా క్రికెటర్‌ మోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో సుమారు మూడేళ్ల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు. అంత గ్యాప్‌ తీసుకున్నప్పటికీ తనలో ఇంకా పస తగ్గలేదని నిరూపించాడు. రీఎంట్రీలో సూపర్‌స్పెల్‌తో అదరగొట్టాడు. తాజా సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మోహిత్‌ పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. ఇందులో ఒక వికెట్‌ జితేష్‌ శర్మది కాగా మరొకటి స్టార్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ది. కాగా మోహిత్‌ చివరిగా 2020 ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున బరిలోకి దిగాడు. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 45 పరుగులిచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు. అయితే ఆ సీజన్‌ మధ్యలోనే మోహిత్‌ తండ్రి కన్నుమూశారు. దీంతో ఐపీఎల్‌ను మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. గుజరాత్ జెయింట్స్ జెర్సీతో సూపర్‌ కమ్‌ బ్యాక్‌ ఇచ్చాడు.

ధోనికి నమ్మదిగిన బౌలర్‌గా..

ఇక మోహిత్‌ శర్మ అంటే ధోనికి నమ్మదగిన బౌలర్‌గా పేరుంది. అందుకు తగ్గట్టుగానే 2013 ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై తరఫున 15 మ్యాచ్‌లు ఆడి మొత్తం 23 వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్‌లో ధోని సేన రన్నరప్‌గా నిలిచినప్పటికి మోహిత్‌ శర్మ మాత్రం అదరగొట్టాడు. ఆ తర్వాత 2015 వరకు చెన్నై జట్టుకే ఆడాడు మోహిత్‌. ఆతర్వాత అంటే 2016-18 వరకు పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అనూహ్యంగా 2018, 2019లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో మళ్లీ సీఎస్‌కేనే దక్కించుకుంది. ఇక 2020 ఐపీఎల్‌ వేలంలో మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లిపోయాడు. 2022 ఐపీఎల్‌లో మోహిత్‌ను నెట్‌ బౌలర్‌ గా తీసుకున్న గుజరాత్‌ జెయింట్స్‌ 2023 మినీ వేలంలో రెగ్యులర్‌ ప్లేయర్‌గా కొనుగోలు చేసింది. మోహిత్‌ శర్మను గుజరాత్‌ టైటాన్స్‌ దక్కించుకుంది.

ఇవి కూడా చదవండి

బ్లూ జెర్సీలోనూ..

ఇక ఐపీఎల్‌లో మొత్తం 88 మ్యాచ్‌లు ఆడిన మోహిత్‌ శర్మ 122 వికెట్లు పడగొట్టాడు. 2013 అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అతను టీమిండియా తరఫున 26 వన్డేల్లో 31 వికెట్లు పడగొట్టాడు. అలాగే 4 టీ20 మ్యాచుల్లో 6 వికెట్లు నేలకూల్చాడు.

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..