AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ఐపీఎల్‌ రన్ మెషీన్‌లు వీరే.. బరిలోకి దిగితే పరుగుల వర్షమే.. టాప్ 5లో ముగ్గురు భారత్ నుంచే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 ఎడిషన్ శుక్రవారం, మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్‌తో నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్‌లో తలపడనుంది.

IPL 2023: ఐపీఎల్‌ రన్ మెషీన్‌లు వీరే.. బరిలోకి దిగితే పరుగుల వర్షమే.. టాప్ 5లో ముగ్గురు భారత్ నుంచే..
Ipl 2023
Venkata Chari
|

Updated on: Mar 30, 2023 | 7:00 AM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 ఎడిషన్ శుక్రవారం, మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్‌తో నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్‌లో తలపడనుంది. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ పాత ఫార్మాట్‌లోని జరగనుంది. రెండు నెలల వ్యవధిలో మొత్తం 12 వేదికలు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ప్రతీ ఏటా లీగ్ సరికొత్తగా అభిమానుల ముందుకు ఎంట్రీ ఇస్తూ.. అదే రేంజ్‌లో ఆకట్టుకుంటోంది. అయితే, ఈసారి కూడా సత్తా చాటేందుకు 10 జట్లు బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. ఇటువంటి పరిస్థితిలో IPL 2023 ముఖ్యంగా ఓ ఐదుగురు బ్యాటర్లపై ఫోకస్ ఉంటుంది. వీరు ఆరెంజ్ క్యాప్ పోటీదారులలో తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

1. జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్): ఇంగ్లండ్ వైట్-బాల్ కెప్టెన్ జోస్ బట్లర్ IPL 2022లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అతను గత సంవత్సరం మొత్తం 17 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 863 పరుగులు చేశాడు. ఈ సంవత్సరం పాత సీజన్‌ ఫాంనే కొనసాగించాలని కోరుకుంటున్నాడు. రాజస్థాన్ రాయల్స్ IPL ట్రోఫీని కూడా గెలవడానికి సహాయం చేయాలని కోరుకుంటున్నాడు.

2. సూర్యకుమార్ యాదవ్ (ముంబయి ఇండియన్స్): ముంబై ఇండియన్స్ మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ICC T20I ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో నిలిచాడు. గతేడాది టీ20 మ్యాచ్‌ల్లో 1,000కు పైగా పరుగులు చేశాడు. 32 ఏళ్ల అతను ప్రస్తుత సమయంలో అత్యుత్తమ షార్ట్-ఫార్మాట్ బ్యాటర్‌గా పేరుగాంచాడు. ఈ సంవత్సరం ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకోవాలని ఆసక్తిగా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

3. విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): ఐపీఎల్ చరిత్రలో ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆల్ టైమ్ అత్యధిక పరుగులు సాధించిన లిస్టులో అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు 223 మ్యాచ్‌లు ఆడి 6624 పరుగులు చేశాడు. గతేడాది పరాభవాలను మర్చిపోయి.. అద్భుత ఫామ్‌తో ఈ ఏడాది ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. 34 ఏళ్ల అతను ఈ ఏడాది మరోసారి బ్యాట్‌తో 2016 లాంటి సీన్‌ను రిపీట్ చేయాలని కోరుకుంటున్నాడు.

4. డేవిడ్ వార్నర్ (ఢిల్లీ క్యాపిటల్స్): IPL 2023 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, డేవిడ్ వార్నర్ ఆల్ టైమ్ రన్ స్కోరర్స్ లిస్ట్‌లో 3వ స్థానంలో ఉన్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో అతని కంటే ఎక్కువ పరుగులు చేసిన విదేశీ ఆటగాడు లేడు. అతను ఐపీఎల్‌లో మూడుసార్లు ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. ఈ సంవత్సరం సంఖ్యను నాలుగుకు పెంచాలనుకుంటున్నాడు.

5. కేఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయింట్స్): కేఎల్ రాహుల్ IPLలో ఆడటాన్ని ఇష్టపడుతున్నాడు. గత ఐదు ఎడిషన్లలో ప్రతి సంవత్సరం సుమారు 600+ పరుగులు సాధించాడు. ప్రస్తుతం రాహుల్ ఫామ్ అంత బాగోలేదు. అతను IPL 2023లో తన అత్యుత్తమ ఫాంలోకి తిరిగి రావాలని కోరుకుంటున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..