IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్‌కు రంగం సిద్ధం.. ఇప్పటి వరకు ట్రోఫీ గెలవని జట్లు ఇవే.. ఈసారైనా లక్ మారేనా?
రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ అత్యధిక సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. కాగా ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు ఇప్పటి వరకు టైటిల్ గెలవలేకపోయాయి.

రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ అత్యధిక సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. కాగా ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు ఇప్పటి వరకు టైటిల్ గెలవలేకపోయాయి. IPL చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండు అత్యంత విజయవంతమైన జట్లుగా నిలిచాయి. ముంబై ఇండియన్స్ అత్యధికంగా 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది.
అదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ IPL 2012, IPL 2014 టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో పాటు రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్ డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలోసారి ఛాంపియన్‌గా నిలిచాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జాయింట్‌లు తమ మొదటి టైటిల్ కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే ఈ జట్లు IPL 2023లో ఛాంపియన్‌లుగా మారగలవు.




IPL 2023లో అభిమానులు RCBపైనే అందరి చూపు నిలిచింది. నిజానికి ఇప్పటి వరకు ఈ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. 15 ఏళ్ల కరువుకు స్వస్తి చెప్పాలనే ఉద్దేశ్యంతో ఈసారి ఈ టీమ్ బరిలోకి దిగనుంది. అయితే, గత కొన్నేళ్లుగా ఆర్‌సీబీ జట్టు దాదాపు ప్రతిసారీ ప్లేఆఫ్స్ వరకు ప్రయాణించింది.
యువరాజ్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి ఆటగాళ్లు IPL చరిత్రలో పంజాబ్ కింగ్స్ తరపున ఆడారు. కానీ, ఈ జట్టు ఎన్నటికీ ఛాంపియన్‌గా మారలేదు. ఈసారి పంజాబ్ కింగ్స్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే గబ్బర్ ప్రీతి జింటా జట్టును తొలిసారి ఛాంపియన్‌గా చేయగలడా.. లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ పంజాబ్ కింగ్స్ జట్టు అద్భుతంగా రాణించి టైటిల్ గెలుస్తుందనడంలో సందేహం లేదు.
IPL చరిత్రలో ఈ ట్రోఫీని ఎన్నడూ కైవసం చేసుకోలేకపోయిన జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఉంది. అయితే ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ ఛాంపియన్‌గా మారగలదా? లేదా చూడాలి. నిజానికి రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్లు లేకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రయాణం అంత సులువు కాదు. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు ఈసారి తమ జట్టు ఛాంపియన్‌గా మారాలని కోరుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




