Viral Video: ఈ చిన్నారి ధోనిని చూశారా.. హెలికాప్టర్ షాట్లతో కుమ్మేసింది.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Trending Video: ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. బ్యాటింగ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌లు, వికెట్ల వెనుక స్పందించే సమయం అందరికీ తెలిసిందే. రెప్పపాటు వ్యవధిలో బ్యాట్స్‌మెన్‌ను చాలాసార్లు పెవిలియన్ చేర్చిన సంఘటనలు చాలానే చూశాం.

Helicopter Shot: ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. బ్యాటింగ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌లు, వికెట్ల వెనుక స్పందించే సమయం అందరికీ తెలిసిందే. రెప్పపాటు వ్యవధిలో బ్యాట్స్‌మెన్‌ను చాలాసార్లు పెవిలియన్ చేర్చిన సంఘటనలు చాలానే చూశాం. అలాగే హెలీకాప్టర్ షాట్‌తో ప్రపంచాన్ని తనవైపు తిప్పేసుకున్నాడు. ఆ తర్వాత చాలామంది హెలీకాప్టర్ షాట్లను ట్రై చేసినట్లు మనం ఎన్నో వీడియోలు చూశాం. అయితే, ప్రస్తుతం నెట్టింట్లో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియలో ఉన్నది మాత్రం.. ఫేమస్ క్రికెటర్ మాత్రం కాదండోయ్. ఓ చిన్నారి తన స్టైల్‌తో అచ్చం ధోనిని దించేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట్లో దూసుకపోతోంది. ఈ చిన్నారి తన ప్రాక్టీస్‌లో ధోనీ లాంటి హెలీకాప్టర్ షాట్లతో కుమ్మేసింది.
ఈ చిన్నారి వీడియోను ఇన్‌స్టాలో పరిషర్మా2013 అకౌంట్‌తో షేర్ చేశారు. ఇప్పటి వరకు 1 లక్షా 69 వేల లైక్స్‌తో ఈ వీడియో నెట్టింట్లో దూసుకపోతోంది. నెటిజన్లు మాత్రం ఈ చిన్నారి బ్యాటింగ్ స్టైల్ చూసి ఆశ్చర్యపోతున్నారు. తన స్టైల్‌కు ఫిదా అయిపోయారు. కామెంట్లతో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అచ్చం లేడీ ధోనిలా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. భవిష్యత్‌లో టీమిండియాలో చేరాలని కోరుకుంటున్నారు. ఫ్యూచక్ కెప్టెన్ అంటూ మెచ్చుకుంటున్నారు.




View this post on Instagram
పరి శర్మ అనే 9 ఏళ్ల చిన్నారి.. తన తండ్రి ప్రదీప్ శర్మ సారథ్యంలో క్రికెట్ కోచింగ్ తీసుకుంటుంది. ఇండియన్ టీంలో ఎంట్రీ ఇవ్వాలనేదే తన ధ్యేయంగా ముందుకు సాగుతోంది. కేవలం బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్, బౌలింగ్‌లోనూ తన సత్తా చాటుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
