- Telugu News Sports News Cricket news From sanju samson to ms dhoni these 5 Wicketkeepers cum batters explosive in ipl 2023
IPL 2023: పేరుకే వికెట్ కీపర్లు.. బరిలోకి దిగితే బౌలర్లపై ఊచకోతే.. లిస్టులో ఐదుగురు డేంజరస్ ప్లేయర్స్..
IPL Wicketkeeper: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది. ఐపీఎల్ 16వ సీజన్‌లో పలు జట్ల వికెట్‌కీపర్ కం బ్యాట్స్‌మెన్స్ రెచ్చిపోయేందుకు సిద్ధమయ్యారు.
Updated on: Mar 30, 2023 | 8:18 AM

IPL 2023 Wicketkeeper Batter: IPL 16వ సీజన్ ప్రారంభానికి కేవలం మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టైటిల్‌ను చేజిక్కించుకునేందుకు అన్ని జట్లు కఠోర సాధనలో మునిగిపోయాయి. నాలుగేళ్ల తర్వాత భారత గడ్డపై ఐపీఎల్ పాత ఫార్మాట్‌కు తిరిగి వచ్చింది. IPL 2023 మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ఐపీఎల్ 16వ సీజన్‌లో అదరగొట్టే వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్స్ చాలా మందే ఉన్నారు. వీరంతా బ్యాటింగ్‌తో బౌలర్లను చితక్కొట్టడం నుంచి.. వికెట్ల వెనుకాల కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటుంటారు. అలాంటి వారిలో ఐదుగురు డేంజరస్ ప్లేయర్లు కూడా ఉన్నారు. లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..


2. క్వింటన్ డెకాక్.. లక్నో సూపర్ కింగ్స్ తుఫాన్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డికాక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గతంలో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ సాధించాడు. IPL 2022లో, మొత్తం మీద అత్యధిక పరుగులు చేసిన మూడవ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గత సీజన్‌లో అతని బ్యాట్‌లో 508 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో అతను ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు సాధించాడు.

3. ఇషాన్ కిషన్.. ముంబై ఇండియన్స్‌కు చెందిన ఇషాన్ కిషన్ కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. గత సీజన్‌లో అతని బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురిసింది. ఈ క్రమంలో మూడు అర్ధ సెంచరీలతో సహా 418 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 81 నాటౌట్. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2023లో కూడా సెంచరీ సాధించేందుకు రెడీ అయ్యాడు.

4. ఎంఎస్ ధోని.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్‌గా పేరుగాంచాడు. ఫామ్‌లో ఉన్నప్పుడు, అతను ఎలాంటి బౌలర్‌నైనా చిత్తు చేయగలడు. గత సీజన్‌లో CSK తరపున 232 పరుగులు చేశాడు. ధోని అత్యధిక స్కోరు 50 నాటౌట్. CSK కెప్టెన్ కం వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధోని భీకర ఫామ్‌ను ఈ సీజన్‌లోనూ చూడొచ్చు.

5. దినేష్ కార్తీక్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ వయసు పెరుగుతున్న కొద్దీ బ్యాటింగ్ మెరుగైంది. గత సీజన్‌లో ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2022లో RCB తరపున వికెట్ కీపింగ్ చేస్తూ 330 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2023లోనూ అతని దూకుడైన శైలిని చూడొచ్చు.




