Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs RR: పవర్ హిట్టర్ల మ్యాచ్‌కు రంగం సిద్ధం.. అందరి దృష్టి ఈ ఐదుగురిపైనే.. లిస్టులో WTC ప్లేయర్స్..

IPL 2023, GT vs RR: ఐపీఎల్ 2023లో ఈరోజు అంటే మే 5, శుక్రవారంన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్లు ముఖాముఖిగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి ఈ ఐదుగురి ఆటగాళ్లపైనే ఉంటుంది.

GT vs RR: పవర్ హిట్టర్ల మ్యాచ్‌కు రంగం సిద్ధం.. అందరి దృష్టి ఈ ఐదుగురిపైనే.. లిస్టులో WTC ప్లేయర్స్..
Gt Vs Rr
Follow us
Venkata Chari

|

Updated on: May 05, 2023 | 2:57 PM

RR vs GT Top-5 Players: ఐపీఎల్ 2023లో 48వ లీగ్ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. రాజస్థాన్, గుజరాత్ జట్లు రెండూ తమ గత మ్యాచ్‌లలో ఓడిపోయాయి. ఇటువంటి పరిస్థితిలో ఇద్దరూ గెలవాలనే ఉద్దేశ్యంతో రంగంలోకి దిగుతారు. ఈ మ్యాచ్‌లో అందరి చూపు ఇరు జట్లకు చెందిన పలువురు ఆటగాళ్లపైనే ఉంటుంది. ఇందులో యశస్వి జైస్వాల్, విజయ్ శంకర్ వంటి టాప్-5 ఆటగాళ్లు ఉన్నారు.

1. యశస్వి జైస్వాల్..

రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు ఐపీఎల్ 2023లో అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో జైస్వాల్ 47.56 సగటుతో, 159.70 స్ట్రైక్ రేట్‌తో 428 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు సాధించాడు.

2. విజయ్ శంకర్..

గుజరాత్ తరపున ఆడుతున్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విజయ్ శంకర్ టోర్నీలో చాలాసార్లు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. చాలా ఇన్నింగ్స్‌లలో తన ప్రభావాన్ని చూపించి జట్టును గెలిపించాడు. ఇప్పటివరకు ఆడిన 7 ఇన్నింగ్స్‌లలో, శంకర్ 41 సగటు, 158.91 స్ట్రైక్ రేట్‌తో 205 పరుగులు చేశాడు. ఇందులో అతని బ్యాట్‌ నుంచి 2 అర్ధ సెంచరీలు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

3. జోస్ బట్లర్..

రాజస్థాన్ రాయల్స్ రెండో ఓపెనర్ జోస్ బట్లర్ కూడా ఇప్పటివరకు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 9 ఇన్నింగ్స్‌లలో, బట్లర్ 32.11 సగటు, 138.94 స్ట్రైక్ రేట్‌తో 289 పరుగులు చేశాడు. బట్లర్ ఇప్పటివరకు 3 ఫిఫ్టీలు చేశాడు.

4. శుభమాన్ గిల్..

గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ IPL 2023లో ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 37.67 సగటు, 140.66 స్ట్రైక్ రేట్‌తో 339 పరుగులు చేశాడు. గిల్ ఇప్పటి వరకు 3 హాఫ్ సెంచరీలు సాధించాడు.

5. మహ్మద్ షమీ..

గుజరాత్ టైటాన్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఇప్పటివరకు అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. టోర్నీలో ఇప్పటి వరకు 17 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ నిలిచాడు. అలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌తో అద్భుతాలు సృష్టించగలడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..