IPL 2023: కోట్లల్లో జాక్‌పాట్ కొట్టారు.. కట్‌చేస్తే.. ఆటలో గల్లీ ప్లేయర్లను తలపించారు.. లిస్టులో ఐదుగురు..
Expensive Players: IPL 2023లో సామ్ కుర్రాన్ నుంచి హ్యారీ బ్రూక్ వరకు ఆటగాళ్లు రూ. 10 కోట్లకు పైగా దక్కించుకున్నారు. కానీ, ఆటలో మాత్రం దిగజారిపోయారు. టాప్ 5 జాబితాలో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..
Expensive Players: ఐపీఎల్ 2023 వేలంలో చాలా మంది ఆటగాళ్లపై భారీగా వేలం వేశారు. ఇందులో పలువురు విదేశీ ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రాన్ ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతడిని పంజాబ్ కింగ్స్ రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది కాకుండా రూ.10 కోట్లకు పైగా జట్లు కొనుగోలు చేసిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. రూ.10 కోట్లకు పైగా కొనుగోలు చేసిన కొంతమంది ఆటగాళ్ల ప్రదర్శనను ఇప్పుడు చూద్దాం..
1- సామ్ కుర్రాన్ (Sam Curran): పంజాబ్ కింగ్స్‌కు చెందిన సామ్ కుర్రాన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో జరిగిన మినీ వేలంలో రూ.18.5 కోట్లకు పంజాబ్ ఫ్రాంచైజీ అతడిని కొనుగోలు చేసింది. సామ్ కుర్రాన్ ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను బౌలింగ్ చేస్తున్నప్పుడు 58.14 సగటుతో 7 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. 11 ఇన్నింగ్స్‌లలో 24 సగటు, 129.39 స్ట్రైక్ రేట్‌తో 216 పరుగులు చేశాడు.
2- నికోలస్ పూరన్ (Nicholas Pooran): ఈ సీజన్ కోసం నిర్వహించిన మినీ వేలంలో వెస్టిండీస్ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.16 కోట్ల భారీ ధరకు జట్టులోకి తీసుకున్నారు. పూరన్ IPL 2023లో 12 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 29.20 సగటు, 173.81 స్ట్రైక్ రేట్‌తో 292 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నుంచి అర్ధ సెంచరీ కూడా వచ్చింది.
3- కామెరాన్ గ్రీన్ (Cameron Green): ఐపీఎల్ 2023 కోసం జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను ముంబై ఇండియన్స్ రూ. 17.5 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుత సీజన్‌లో గ్రీన్ 12 మ్యాచ్‌లు ఆడాడు. 39.57 సగటు, 148.92 స్ట్రైక్ రేట్‌తో 277 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి 2 హాఫ్ సెంచరీలు వచ్చాయి. బౌలింగ్‌లో 48.83 సగటుతో 6 వికెట్లు తీశాడు.
4- బెన్ స్టోక్స్ (Ben Stokes): ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2023 కోసం రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు సీజన్‌లో స్టోక్స్ తన ఫిట్‌నెస్‌తో పోరాడుతున్నట్లు కనిపిస్తున్నాడు. అతను IPL 2023లో కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 15 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ వికెట్లు తీయలేదు.
5- హ్యారీ బ్రూక్ (Harry Brook): మినీ వేలంలో ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 13.25 కోట్లకు కొనుగోలు చేసింది. బ్రూక్ IPL 2023లో 9 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 20.38 సగటు, 121.64 స్ట్రైక్ రేట్‌తో 163 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ సాధించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..