PBKS vs RR: వర్చువల్ నాకౌట్‌లో ఏ జట్టు ఓడినా.. ప్లే ఆఫ్స్ నుంచి ఔటే.. కీలక మార్పులతో బరిలోకి రాజస్థాన్..

Indian Premier League: ఈ సీజన్‌లో 66వ లీగ్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరగనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటిది.

PBKS vs RR: వర్చువల్ నాకౌట్‌లో ఏ జట్టు ఓడినా.. ప్లే ఆఫ్స్ నుంచి ఔటే.. కీలక మార్పులతో బరిలోకి రాజస్థాన్..
Pbks Vs Rr Playing Xi
Follow us

|

Updated on: May 19, 2023 | 4:47 PM

PBKS vs RR Probable Playing XI: ఐపీఎల్ 16వ సీజన్ 66వ లీగ్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరగనుంది. ధర్మశాలలోని అందమైన స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌లా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడినా ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అదే సమయంలో గెలిచిన జట్టు ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. మ్యాచ్ ప్రాముఖ్యతను పరిశీలిస్తే, ఈ మ్యాచ్‌కి రెండు జట్లు ఏ ప్లేయింగ్ XIతో వెళ్లవచ్చో తెలుసుకుందాం.

గత మ్యాచ్‌లో మొత్తం 400 కంటే ఎక్కువ పరుగులు నమోదైన ధర్మశాల స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ బ్యాట్స్‌మెన్స్ అద్భుత ప్రదర్శన చూడాలనే ఆశ అందరిలో ఉంది. ఇటువంటి పరిస్థితిలో, రెండు జట్లు అదనపు బౌలర్‌తో మైదానంలోకి దిగాలని నిర్ణయించుకోవచ్చు. ఇదే మైదానంలో ఢిల్లీతో జరిగిన చివరి మ్యాచ్‌లో పంజాబ్ 15 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ తరపున లియామ్ లివింగ్‌స్టన్ 94 పరుగుల ఇన్నింగ్స్‌ నమోదు చేశాడు. అయితే ఆ జట్టు బౌలర్లు తమ ప్రదర్శనతో అందరినీ నిరాశపరిచారు.

రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 112 పరుగుల భారీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 59 పరుగులకే కుప్పకూలింది. ఇటువంటి పరిస్థితిలో ప్లేయింగ్ ఎలెవన్‌లో కొన్ని కీలక మార్పులు చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

పంజాబ్ కింగ్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI..

శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అథర్వ తైడే, జితేష్ శర్మ, షారుఖ్ ఖాన్, లియామ్ లివింగ్‌స్టన్, సామ్ కర్రాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్.

ఇంపాక్ట్ ప్లేయర్స్ – నాథన్ ఎల్లిస్, సికందర్ రజా, రిషి ధావన్, బల్తేజ్ సింగ్, మోహిత్ రాఠీ.

రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI..

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), జో రూట్, షిమ్రాన్ హెట్మెయర్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, కెఎమ్ ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్.

ఇంపాక్ట్ ప్లేయర్స్ – జాసన్ హోల్డర్, ఆడమ్ జంపా, మురుగన్ అశ్విన్, రియాన్ పరాగ్, కుల్దీప్ యాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!