AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Final 2023 GT vs CSK: ఐపీఎల్ 2023 ట్రోఫీ ధోనీ సేనదే.. ఇదిగో సాక్ష్యం..

IPL Final 2023 CSK vs MI: ఈ సీజన్ చివరి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మే 28న జరుగుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.

IPL Final 2023 GT vs CSK: ఐపీఎల్ 2023 ట్రోఫీ ధోనీ సేనదే.. ఇదిగో సాక్ష్యం..
Gt Vs Csk
Venkata Chari
|

Updated on: May 27, 2023 | 5:44 PM

Share

CSK vs GT, Indian Premier League Final 2023: ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య మే 28న జరగనుంది. ఈ సీజన్ కూడా ఇరు జట్ల మధ్య మ్యాచ్‌తో ప్రారంభమైంది. ఆ తర్వాత క్వాలిఫయర్ 1 మ్యాచ్ కూడా చెన్నై, గుజరాత్ మధ్య జరిగింది. ఇప్పుడు ఈ రెండు జట్లూ ఫైనల్ మ్యాచ్‌లో మరోసారి తలపడనున్నాయి.

ఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్ల జోరు భారీగానే కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పైచేయి సాధించిన రికార్డు కూడా ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు క్వాలిఫయర్ 1లో ఆడే జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగడం 9 సార్లు కనిపించింది.

ఇప్పుడు ఈ సీజన్‌లో కూడా అలాంటిదే కనిపించింది. ఇప్పటి వరకు ఈ రికార్డు ప్రకారం క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో గెలిచిన జట్టు 9కి 7 సార్లు ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో విజయం సాధించడం అంత సులువు కాదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

2022లో జరిగిన ఐపీఎల్ సీజన్‌లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ గుజరాత్, రాజస్థాన్ జట్ల మధ్య జరిగింది. ఇందులో గుజరాత్ విజయం సాధించి నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. ఆ తర్వాత మళ్లీ ఆఖరి మ్యాచ్‌లో రాజస్థాన్‌తో తలపడగా గుజరాత్‌ గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.

చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు కూడా ఇదే బాటలో..

ఈ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ రికార్డును పరిశీలిస్తే.. 2011 సీజన్ నుంచి 5 సార్లు క్వాలిఫయర్ 1 మ్యాచ్ ఆడిన తర్వాత.. ఇదే జట్టుతో ఫైనల్ మ్యాచ్ కూడా ఆడింది. ఇందులో 2013లో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ముంబైని ఓడించినా ఫైనల్‌లో 23 పరుగుల తేడాతో ముంబై చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ఇక 2011లో చెన్నై క్వాలిఫయర్ 1, ఫైనల్‌లో RCBని ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. 2015 సీజన్‌లో ముంబైతో జరిగిన క్వాలిఫయర్ 1, ఫైనల్‌లో చెన్నై ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

2018లో చెన్నై క్వాలిఫయర్ 1లో హైదరాబాద్‌ను ఓడించి ఫైనల్‌లో కూడా విజయం సాధించింది. 2019 సీజన్‌లో ముంబై క్వాలిఫైయర్ 1, ఫైనల్ రెండింటిలోనూ చెన్నైని ఓడించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..