Video: ప్రియురాలితో టీమిండియా ప్లేయర్ హల్‌చల్.. పబ్లిక్‌గా తొలిసారి సందడి చేసిన జోడీ..
Prithvi And Nidhi: భారత ఆటగాడు పృథ్వీ షా తన స్నేహితురాలు నిధి తపాడియాతో కలిసి మొదటిసారిగా బహిరంగ వేదికపై కనిపించాడు. అబుదాబిలో జరిగిన IIFA అవార్డు షోలో ఇద్దరూ కలిసి హల్ చల్ చేశారు.
Prithvi Shaw And Nidhi Tapadia: ఐపీఎల్ 16వ సీజన్‌లో తన ప్రదర్శన కారణంగా ఎవరైనా ఆటగాడు ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్నారంటే.. అది ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఆటగాడు పృథ్వీ షా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు జట్టు ప్రయాణం లీగ్ దశతో ముగిసిన తర్వాత, షా తన స్నేహితురాలు నిధి తపాడియాతో కలిసి పబ్లిక్ ఈవెంట్‌లో మొదటిసారి కనిపించారు. మే 26న అబుదాబిలో జరిగిన IIFA అవార్డుల కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు.
పృథ్వీ షా స్నేహితురాలు నిధి తపాడియా మోడల్, నటనలో కెరీర్‌ను కొనసాగించాలనుకుంటోంది. ఈ కార్యక్రమంలో ఇద్దరూ నల్లటి దుస్తుల్లో కనిపించారు. పృథ్వీ షా బ్లాక్ కలర్ జీన్స్‌తో పాటు జాకెట్, షర్ట్ ధరించి ఉన్నాడు. కాగా నిధి బ్లాక్ కలర్ చీర కట్టుకుంది. ఇద్దరూ కలిసి చాలా అందమైన జంటగా కనిపించారు.
పృథ్వీ షాకు ఈ ఐపీఎల్ సీజన్ అంత కలిసిరాలేదు..
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగమైన పృథ్వీ షాకి, అతని క్రికెట్ కెరీర్‌లో ఇది ఇప్పటివరకు అత్యంత చెత్త IPL సీజన్. అతని పేలవమైన ఫామ్ కారణంగా ప్లేయింగ్ 11 నుంచి కొన్ని మ్యాచ్‌ల తర్వాత జట్టు మేనేజ్‌మెంట్ షాను తొలగించింది. అయితే సీజన్ చివర్లో షాకు కొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది. ఇందులో పంజాబ్ కింగ్స్ పై అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడగలిగాడు.
View this post on Instagram
ఈ సీజన్‌లో 23 ఏళ్ల పృథ్వీ షా 8 మ్యాచ్‌ల్లో 106 పరుగులు మాత్రమే చేయగలిగాడు. షా పేలవమైన ఫామ్ దృష్ట్యా అతను భారత జట్టులోకి తిరిగి రావడం కుదరడం లేదు. వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో కొంతమంది యువ ఆటగాళ్లు భారత జట్టుకు ఆడే అవకాశం లభించవచ్చు. ఇందులో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ పేర్లు రేసులో ముందంజలో ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..