AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ధోనికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఫ్యాన్స్‌.. స్పెషల్‌ గిఫ్ట్‌ చూసి షాకైన మిస్టర్‌ కూల్‌.. వైరల్‌ వీడియో

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎంఎస్ ధోని జట్టు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ సీజన్‌లో చివరి హోమ్ గ్రౌండ్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ అనంతరం ధోనీ సహా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లందరూ..

IPL 2023: ధోనికి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఫ్యాన్స్‌.. స్పెషల్‌ గిఫ్ట్‌ చూసి షాకైన మిస్టర్‌ కూల్‌.. వైరల్‌ వీడియో
MS Dhoni
Basha Shek
|

Updated on: May 20, 2023 | 10:16 AM

Share

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎంఎస్ ధోని జట్టు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ సీజన్‌లో చివరి హోమ్ గ్రౌండ్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ అనంతరం ధోనీ సహా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లందరూ మైదానం చుట్టూ కలియ తిరిగారు. నిజానికి చెపాక్ స్టేడియంతో ధోనీకి ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే ధోనీ అండ్‌కోకు ఇక్కడి అభిమానుల నుంచి చాలా మద్దతు లభిస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన చివరి ఐపీఎల్ మ్యాచ్ చెన్నై లో ఆడాలనుకుంటున్నాను అంటూ ధోని చెప్పిన సంగతి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇలా చెపాక్‌ స్టేడియంతో ఎంతో అనుబంధమున్న ధోనికి చెన్నై అభిమానులు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఇది చూసి ధోని కూడా ఆశ్చర్యపోయాడు. ఇంతకీ చెన్నై ఫ్యాన్స్‌ ఇచ్చిన గిఫ్ట్‌ ఏంటో తెలుసా? చెపాక్ స్టేడియంతో రూపంలో ఉన్న ఓ మినీయేచర్‌ను ధోనికి బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసి ధోనితో పాటు అతని అభిమానులు తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఇక ఐపీఎల్‌లో చెన్నై ఆటతీరును పరిశీలిస్తే, చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ ప్లేఆఫ్‌ బెర్త్‌ ఇంకా ఖరారు కాలేదు. గురువారం విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో విజయం చెన్నై, లక్నో జట్లకు అనివార్యం. ప్రస్తుతం చెన్నై, లక్నో జట్లకు 15 పాయింట్లు ఉన్నాయి. బెంగళూరు, ముంబై జట్ల ఖాతాలో కూడా 14 పాయింట్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్‌కు 14 పాయింట్లు ఉన్నాయి. అయితే బెంగళూరు, చెన్నై, లక్నో తమ ఆఖరి మ్యాచ్‌లలో గెలిస్తే నేరుగా ప్లే-ఆఫ్స్‌కు చేరుకోవచ్చ. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

నెలకు రూ.55,932 జీతంతో.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో కొలువులు
నెలకు రూ.55,932 జీతంతో.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో కొలువులు
పెట్టుబడిదారులకు లాభాల పంట పండించిన కండోమ్స్‌ కంపెనీ!
పెట్టుబడిదారులకు లాభాల పంట పండించిన కండోమ్స్‌ కంపెనీ!
కాఫీ ఈ టైంలో తాగారంటే.. మీకు ఆరోగ్య సమస్యలు రానేరావు!
కాఫీ ఈ టైంలో తాగారంటే.. మీకు ఆరోగ్య సమస్యలు రానేరావు!
భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..
భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..
వెనిజులాలో తులం బంగారం రూ.1,816 మాత్రమేనా?
వెనిజులాలో తులం బంగారం రూ.1,816 మాత్రమేనా?
పదో తరగతి అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే?
వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే?
విదేశీ విద్యకు ఆర్థిక భరోసా అందించే స్కాలర్‌షిప్.. దరఖాస్తు లింక్
విదేశీ విద్యకు ఆర్థిక భరోసా అందించే స్కాలర్‌షిప్.. దరఖాస్తు లింక్
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..
చేతిలో త్రిశూలం.. నుదిటిపై తిలకం.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్..
చేతిలో త్రిశూలం.. నుదిటిపై తిలకం.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్..