IPL 2023: నిలవాలంటే గెలవాల్సిందే .. మరికొన్ని గంటల్లో తేలనున్న చెన్నై, కోల్‌కతా, లక్నోల ప్లే ఆఫ్స్ భవితవ్యం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (మే20) రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్, ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (మే20) రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్, ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే రెండో మ్యాచ్‌లో నితీష్ రాణా నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్, కృనాల్ పాండ్యా లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈరోజు జరిగే మ్యాచ్‌లో సీఎస్‌కే గెలిస్తే ప్లేఆఫ్‌లోకి ప్రవేశించిన రెండో జట్టుగా నిలుస్తుంది. ఇందులో పెద్ద ఆశ్చర్యమేమీ లేదకానీ ఇప్పుడు అందరి దృష్టి కేకేఆర్ వర్సెస్ లక్నో మ్యాచ్‌పైనే ఉంది. ఇందులో గెలిచిన జట్టు ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుంది. ఓడిన జట్టు మాత్రం ఇంటిదారి పట్టాల్సిందే. కాగా గత మ్యాచ్‌లో చెన్నైపై కేకేఆర్ 6 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించి జోష్‌లో ఉంది. ఆ జట్టుకు జాసన్ రాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ జోడీ మంచి శుభారంభం అందిస్తున్నారు. కెప్టెన్ నితీశ్ రాణా, రింకూ సింగ్‌లు ప్రతి మ్యాచ్‌లోనూ పరుగులు చేస్తున్నారు. అయితే వెంకటేష్ అయ్యర్ నిలకడగా ఆడాల్సి ఉంది. ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్ కూడా మెరుగ్గా రాణిస్తే ఆజట్టుకు విజయం నల్లేరుపై నడకే అవుతుంది. బౌలింగ్‌లో సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా, సుయేశ్ శర్మ కోల్‌కతాకు కీలకం కానున్నారు.
ఇక్కడ లక్నో జట్టు కూడా చాలా బలంగా ఉంది. ఖలీల్ మేయర్స్ జట్టుకు శుభారంభం అందిస్తున్నాడు. ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ లు మిడిలార్డర్‌లో దూకుడుగా ఆడుతూ జట్టుకు భారీస్కోర్లు అందిస్తున్నారు. క్వింటన్ డి కాక్ కూడా జట్టులో ఉన్నాడు. దీపక్ హుడా ఫామ్‌లోకి రావాల్సి ఉంది. కెప్టెన్ కృనాల్ పాండ్యా కూడా తన ఆల్ రౌండ్ ట్యాగ్‌కు న్యాయం చేయాల్సి ఉంది. బౌలింగ్‌లో నవీన్ ఉల్ హక్, అవేశ్ ఖాన్, రవి బిష్టోయ్, అమిత్ మిశ్రా మంచి ఫామ్‌లో ఉండడం లక్నో జట్టుకు బలంగా మారింది.
?? ?????, ???? ?? ???? ?️?#KKRvLSG | #AmiKKR | #TATAIPL pic.twitter.com/FuK1DH9mXW
— KolkataKnightRiders (@KKRiders) May 20, 2023
⬇️ ↘️ ↙️ & ??? ?? ??? ?????? 6️⃣? pic.twitter.com/Ha5wlOu5Up
— KolkataKnightRiders (@KKRiders) May 20, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..