WTC Final 2023: WTC ఫైనల్‌కు ముందు టీమిండియాకు మరో భారీ షాక్.. గాయపడిన స్టార్ ఆల్‌రౌండర్
ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత, టీమ్ ఇండియా వరుసగా రెండోసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. తొలి ఎడిషన్‌లో కివీస్ టీమ్ ఇండియాకు ప్రత్యర్థిగా నిలవగా, రెండో ఎడిషన్‌లో ఆసీస్‌తో తలపడింది. ఈ గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లను ప్రకటించారు.

ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత, టీమ్ ఇండియా వరుసగా రెండోసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. తొలి ఎడిషన్‌లో కివీస్ టీమ్ ఇండియాకు ప్రత్యర్థిగా నిలవగా, రెండో ఎడిషన్‌లో ఆసీస్‌తో తలపడింది. ఈ గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లను ప్రకటించారు. అయితే ఫైనల్ మ్యాచ్‌కు ముందు చాలా మంది ఆటగాళ్లు గాయాల బారిన పడడం టీమ్ ఇండియాను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఐపీఎల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు దూరమయ్యాడు. రాహుల్‌కు బదులుగా ఇషాన్ కిషన్‌కు జట్టులో అవకాశం కల్పించారు. మరోవైపు శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్ కూడా గాయపడ్డారు. వీరిద్దరిపై బీసీసీఐ తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది. ఈ షాక్‌ల నుంచి తేరుకోకముందే టీమిండియా ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ ఆర్ అశ్విన్ దూరమయ్యాడు. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. వెన్ను గాయం కారణంగా అశ్విన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అశ్విన్‌కు బదులుగా ఆడమ్ జంపాను జట్టులోకి తీసుకున్నారు. అశ్విన్ గాయం తీవ్రత ఇంకా తెలియరాలేదు. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు టీమ్ ఇండియాకు ఇది ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. ఈ గాయం నుంచి అశ్విన్ త్వరగా కోలుకోవాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.
WTC ఫైనల్‌కు భారత జట్టు:




రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.
WTC ఫైనల్‌కు ఆస్ట్రేలియా జట్టు:
పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియోన్, మిచెల్ మార్షాన్ , టాడ్ మర్ఫీ, మిచెల్ స్టార్, మాథ్యూ రెన్షా.
Nothing much, just 621 T20 wickets in one frame. ? pic.twitter.com/AIoJA9uX7C
— Rajasthan Royals (@rajasthanroyals) May 18, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..