PBKS vs RCB IPL 2022 Match Prediction: పంజాబ్, బెంగళూరు భవితవ్యాలను కొత్త కెప్టెన్లు మార్చేనా?
Punjab Kings vs Royal Challengers Bangalore Preview: ఐపీఎల్ చరిత్రలో ట్రోఫీ గెలవని టీంలలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ కూడా ఉన్నాయి. ఆదివారం రెండో మ్యాచులో భాగంగా ఇరుజట్లు తలపడనున్నాయి.
ఐపీఎల్ 2022 నేటి నుంచి మొదలైంది. రెండు నెలల క్రికెట్ జాతర మార్చి 26, శనివారం నుంచి ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (CSK vs KKR) మధ్య మ్యాచ్‌తో IPL (IPL 2022) 15వ సీజన్ ఛాంపియన్ రేసు ప్రారంభం కానుంది . ఇటువంటి పరిస్థితిలో జనవరి 27 ఆదివారం రెండు మ్యాచ్‌లు అంటే డబుల్ హెడర్ ఉంది. వీటిలో, రెండవ మ్యాచ్ నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో రాత్రి 7.30 నుంచి జరుగుతుంది. ఇందులో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (PBKS vs RCB) ముఖాముఖిగా తలపడతాయి. ఈ రెండు జట్లు ఎంతోమంది గొప్ప ఆటగాళ్లతో నిండి ఉన్నాయి. కానీ, ఎప్పుడూ టైటిల్ గెలవలేదు. ప్రస్తుతం కొత్త సీజన్, కొత్త ఫార్మాట్, కొత్త ప్లేయర్‌లతో వారు ఎలా రాణిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
10 జట్లతో కూడిన ఈ సీజన్‌లో రెండు గ్రూపులుగా విభజించారు. ఈ రెండు జట్లూ ఒకే గ్రూపులో ఉన్నాయి. అంటే, ఈ రెండు టీంలు ఒకరితో ఒకరు రెండుసార్లు తలపడతారు. ఇటువంటి పరిస్థితిలో, రెండు జట్లు మంచి ఫలితాలతో సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. అయితే, సీజన్ ప్రారంభ మ్యాచ్‌లలో ఇరు జట్లూ తమ కీలక ఆటగాళ్లు లేకపోవడంతో, దాని ప్రభావం ప్రదర్శనపై కూడా పడే ఛాన్స్ ఉంది.
ఆటగాళ్ల లభ్యత..
బెంగళూరుకు చెందిన ప్రధాన ఆస్ట్రేలియా ఆటగాళ్లు గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ హేజిల్‌వుడ్‌లు తొలి మూడు మ్యాచ్‌ల్లో ఆడరు. వీరిద్దరితో పాటు ఆస్ట్రేలియా బౌలర్ జాసన్ బెహ్రెండార్ఫ్ కూడా పాకిస్థాన్ పర్యటనలో ఉన్నందున ఏప్రిల్ 6లోపు జట్టులో చేరలేడు. మరోవైపు పంజాబ్‌కు కూడా సవాల్ ఎదురైంది. జట్టుకు చెందిన ఇద్దరు కీలక ఓవర్సీస్ ఆటగాళ్లు కగిసో రబాడ, జానీ బెయిర్‌స్టో తొలి మ్యాచ్‌కు దూరం కానున్నారు. బెయిర్‌స్టో వెస్టిండీస్ పర్యటనలో ఉండటంతో రెండో మ్యాచ్ కూడా ఆడలేడు.
కొత్త కెప్టెన్ల వల్ల ఎవరికి లాభం?
కాగా, కెప్టెన్ల గురించి మాట్లాడతే.. ఈ సీజన్‌తో ఇరు జట్లలో నాయకత్వ మార్పు చోటు చేసుకుంది. బెంగళూరులో విరాట్ కోహ్లీ స్థానంలో ఫాఫ్ డు ప్లెసిస్, పంజాబ్‌లో కేఎల్ రాహుల్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఐపీఎల్‌లో వీరిద్దరూ తొలిసారి కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. అయితే ఇక్కడ రెండు జట్ల మధ్య చాలా తేడా ఉంది. డు ప్లెసిస్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ కెప్టెన్సీ అనుభవంతో మెరుగైన కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు. అలాగే అతనికితోడు విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. మరోవైపు, మయాంక్ మొదటిసారిగా సీనియర్ స్థాయిలో కెప్టెన్సీని చేపట్టబోతున్నాడు. పెద్ద స్థాయిలో కెప్టెన్సీలో అనుభవం ఎక్కువగా లేకపోవడంతో ఎలా రాణిస్తాడో చూడాలి.
బెంగళూరు బౌలింగ్..
ఇప్పుడు ఆటగాళ్ల గురించి మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్‌ని పంజాబ్ బ్యాటింగ్‌కు, బెంగళూరు బౌలింగ్‌కు మధ్య పోటీ అని పిలిస్తే తప్పేమీ లేదు. మెగా వేలం తర్వాత సిద్ధమైన జట్టులో, పంజాబ్ కంటే బెంగళూరు మెరుగైన, సమతుల్య జట్టుగా కనిపిస్తోంది. జట్టు బలం దాని బౌలింగ్‌లో ఉంది. ఇది ముంబైలో ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించవచ్చు. హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, బహుశా డేవిడ్ విల్లీల పేస్ దాడికి వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్ నుంచి స్పిన్ మద్దతు ఉంటుంది. పంజాబ్‌తో పోలిస్తే ఆ జట్టు బ్యాటింగ్ కాస్త డల్ గా కనిపిస్తోంది. జట్టు ప్రధాన బాధ్యత కెప్టెన్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీపై ఉంటుంది. మ్యాక్స్‌వెల్ లేకపోవడంతో జట్టు ఒత్తిడికి లోనవుతుంది. మాక్స్‌వెల్ స్థానంలో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్‌కు అవకాశం దక్కే అవకాశం ఉంది.
పంజాబ్ బ్యాటింగ్..
అదే సమయంలో, పంజాబ్ బ్యాటింగ్‌లో ఎంతో పవర్ ఉంది. ఓపెనింగ్‌లో కెప్టెన్ మయాంక్, శిఖర్ ధావన్‌ల బలమైన జోడీ ఉండగా, మిడిలార్డర్‌లో లియామ్ లివింగ్‌స్టన్, షారూఖ్ ఖాన్, లోయర్ ఆర్డర్‌లో ఓడిన్ స్మిత్‌ల బలం ఉంది. మధ్యలో అండర్-19 జట్టులోని స్టార్ ఆల్ రౌండర్ రాజంగద్ బావాకు కూడా అవకాశం వస్తుందని భావిస్తున్నారు. అయితే రబాడ లేకపోవడం బౌలింగ్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. అర్ష్‌దీప్ సింగ్‌కు మద్దతు ఇవ్వడానికి సందీప్ శర్మ, రిషి ధావన్, ఇషాన్ పోరెల్ వంటి యువ బౌలర్లపై ఆధారపడాల్సి ఉంది. అయితే, స్పిన్‌లో రాహుల్ చాహర్‌తో హర్‌ప్రీత్ బ్రార్ ఉన్నాడు. ఇప్పటికీ బౌలింగ్ జట్టు బలహీనంగా కనిపిస్తోంది.
రెండు జట్ల స్క్వాడ్‌లు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, హర్షల్ పటేల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, అనుజ్ రావత్, మహిపాల్ లోమోర్డ్, డేవిడ్ విల్లీ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సిద్ధార్థ్ కౌల్, ఫిన్ అలెన్, లవ్‌నీత్ సిసోడియా, అనిశ్వర్ గౌతమ్, సుయాష్ ప్రభుదేశాయ్, ఆకాష్ దీప్, చామ మిలింద్.
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, భానుక రాజపక్సే, లియామ్ లివింగ్‌స్టన్, జానీ బెయిర్‌స్టో, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, ఇషాన్ పోరెల్, కగిసో రబడ, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, సందీప్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, బెన్నీ హౌవెల్, అథర్వ తైదే, అన్ష్ పటేల్, ఓడియన్ స్మిత్, ప్రేరక్ మన్కడ్, రాజ్ బావా, రిషి ధావన్, షారుఖ్ ఖాన్, హృతిక్ ఛటర్జీ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ.
Also Read: CSK vs KKR Live Score, IPL 2022: టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్.. ప్లేయింగ్ XIలో ఎవరున్నారంటే?