- Telugu News Photo Gallery IPL 2022 Most Wickets in 1st Over: Bhuvneshwar Kumar holds record with 19 wickets in Telugu
IPL 2022: IPL 2022: మొదటి ఓవర్లలో అత్యధిక వికెట్ల వీరులు వీరే.. లిస్టులో టీమిండియా బౌలర్లు ఎవరున్నారంటే..
IPL 2022: బ్యాటర్ల స్వర్గధామంగా పేరొందిన టీ20ల్లో తగ్గేదే అంటూ కొందరు బౌలర్లు సత్తా చాటుతున్నారు. మొదటి ఓవర్లోనే వికెట్లు నేలకూల్చి ప్రత్యర్థి జట్లను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నారు.
Updated on: Mar 26, 2022 | 6:34 PM

సాధారణంగా టీ20ల్లో బ్యాటర్లదే హవా అనుకుంటారు. అయితే బౌలర్లు కూడా తగ్గేదేలే అంటూ సత్తాచాటుతుంటారు. బుల్లెట్ లాంటి బంతులతో బ్యాటర్లను బోల్తాకొట్టిస్తుంటారు. అలా ఐపీఎల్ మెగా టోర్నీలో మొదటి ఓవర్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఎవరంటే..

ఈ జాబితాలో భారత దిగ్గజ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ముందున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన ఈ వెటరన్ పేసర్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే 19 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో మొత్తం 132 మ్యాచులు ఆడిన భువీ 142 వికెట్లు పడగొట్టాడు. ఈసారి ఆ రికార్డును మరింత మెరుగుపర్చుకోవాలనుకుంటున్నాడు.

ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాడు సందీప్ శర్మ ఉన్నాడు. టీమిండియాలో చోటు దక్కకున్నా ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తోన్న సందీప్ 99 మ్యాచ్‌ల్లో 112 వికెట్లు తీశాడు. అందులో ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే 13 సార్లు వికెట్ పడగొట్టాడు

ఇక న్యూజిలాండ్ స్పీడ్‌స్టర్ ట్రెంట్ బౌల్ట్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన ఈ లెఫ్టార్మ్ స్టార్ పేసర్ తొలి ఓవర్లోనే 10 వికెట్లు పడగొట్టాడు. ఇక అతనితో సమానంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు దీపక్ చాహర్ ఉన్నాడు. ఈ టీమిండియా పేసర్ కూడా తొలి ఓవర్లోనే 10 వికెట్లు పడగొట్టాడు.

మరికొన్ని గంటల్లో ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. బ్యాటర్లతో పాటు బౌలర్ల కూడా తమ సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈసారి సీజన్‌లో మొదటి ఓవర్లోనే వికెట్లు తీసే బౌలర్లు ఎవరో..




