CSK vs KKR , IPL 2022: మెగా టోర్నీలో కోల్‌కతా శుభారంభం.. ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం..

Venkata Chari

| Edited By: Basha Shek

Updated on: Mar 26, 2022 | 11:35 PM

Chennai Super Kings vs Kolkata Knight Riders Live Score in Telugu: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా ముందు 132 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

CSK vs KKR , IPL 2022: మెగా టోర్నీలో కోల్‌కతా శుభారంభం.. ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం..
Csk Vs Kkr Ipl Match

ఐపీఎల్(IPL 2022) తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య (Chennai Super Kings vs Kolkata Knight Riders)ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్‌కతా టీం ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వాంఖడేలో ముందుగా బౌలింగ్ చేసే టీం లాభపడుతుందని మరోసారి రుజువైంది. కోల్‌కతా బౌలర్ల దెబ్బకు చెన్నై టీం వరుసగా వికెట్లు కోల్పోతూ తొలిమ్యాచ్‌లో తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడిన చెన్నై టీం తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 125 పరగులు సాధించింది. దీంతో కోల్‌కతా ముందు 121 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. చెన్నై బ్యాట్స్‌మెన్స్‌లో ఎంఎస్ ధోనీ 50(38 బంతులు, 7 ఫోర్లు, 1 సిక్స్), రాబిన్ ఊతప్ప 28(21 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సులు), అంబటి రాయుడు 15, రవీంద్ర జడేజా 26, గైక్వాడ్ 0, కాన్వే 3, శివం దూబే 3, ధోనీ 2 పరుగులు చేశారు.

రెండు జట్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్(కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షెల్డన్ జాక్సన్, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా(కెప్టెన్), శివమ్ దూబే, ఎంఎస్ ధోని(కీపర్), డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, తుషార్ దేశ్‌పాండే

Key Events

రెండు జట్లకు కొత్త కెప్టెన్

ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(జడేజా), కోల్‌కతా నైట్ రైడర్స్(శ్రేయాస్ అయ్యర్) రెండూ కొత్త కెప్టెన్లతో అడుగుపెడుతున్నాయి.

10 జట్లతో ఐపీఎల్..

ఈసారి ఐపీఎల్ కొత్త ఫార్మాట్‌లో కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి రెండు కొత్త జట్లు వచ్చాయి. మొత్తం జట్ల సంఖ్య 10కి చేరుకుంది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 26 Mar 2022 11:10 PM (IST)

    కోల్‌కతా ప్రతీకారం.. మొదటి మ్యాచ్‌లో చెన్నైపై జయభేరి.

    గత ఐపీఎల్‌ సీజన్‌ ఫైనల్‌లో చెన్నై చేతిలో ఎదురైన పరాభవానికి కోల్‌కతా ప్రతీకారం తీర్చుకుంది. శనివారం వాంఖడే మైదానంలో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఆరువికెట్ల తేడాతో ఆ జట్టుపై విజయం సాధించింది. 132 పరుగుల టార్గెట్‌ను తొమ్మిది బంతులు ఉండగానే అందుకుంది. అజింక్యా రహానే (44), సామ్ బిల్లింగ్స్‌ (25), నితీశ్‌ రాణా (21), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (20) పరుగులతో కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించారు.

  • 26 Mar 2022 11:00 PM (IST)

    మూడో వికెట్‌ తీసిన బ్రేవో..కేకేఆర్‌ స్కోరు ఎంతంటే..

    కేకేఆర్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. వెటరన్‌ బౌలర్‌ డ్వేన్‌ బ్రావో బౌలింగ్‌లో సామ్‌ బిల్లింగ్స్‌ (25) ఔటయ్యాడు. ప్రస్తుతం కోల్‌కా స్కోరు 18.2 ఓవర్లలో 129/4.

  • 26 Mar 2022 10:45 PM (IST)

    టార్గెట్‌కు చేరువలో కేకేఆర్‌.. వంద పరుగులు దాటిన స్కోరు.

    కేకేఆర్‌ లక్ష్యానికి చేరువవుతోంది. శ్రేయస్‌ అయ్యర్‌ (8), సామ్‌ బిల్లింగ్స్‌ (11) నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం కోల్‌కతా స్కోరు 15.2 ఓవర్లలో 105/3. శ్రేయస్‌ జట్టు విజయానికి 28 బంతుల్లో 27 పరుగులు అవసరం.

  • 26 Mar 2022 10:32 PM (IST)

    కోల్‌కతా మూడో వికెట్‌ డౌన్‌.. క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌..

    కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. స్పిన్నర్‌ శాంట్నర్‌ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు అజింక్యా రహానే (44). ప్రస్తుతం క్రీజులో సామ్ బిల్లింగ్స్‌ (1), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (4) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కేకేఆర్‌ స్కోరు 12 ఓవర్లలో 90/3.

  • 26 Mar 2022 10:26 PM (IST)

    కోల్‌కతాను మళ్లీ దెబ్బతీసిన బ్రేవో.. పెవిలియన్‌ చేరిన రాణా

    కోల్‌కతా జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది. దూకుడుగా ఆడుతోన్న నితీశ్‌రాణా (17 బంతుల్లో 21) బ్రేవో చేతికి చిక్కాడు. 9 ఓవర్‌లో రాయుడుకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు రాణా. ప్రస్తుతం కోల్ కతా స్కోరు 10.4 ఓవర్లలో82/2

  • 26 Mar 2022 10:17 PM (IST)

    రాణా దూకుడు.. కేకేఆర్‌ విజయానికి ఇంకా ఎన్ని రన్స్‌ కావాలంటే..

    కేకేఆర్‌ నిలకడగా బ్యాటింగ్‌ చేస్తోంది. ఓపెనర్‌ రహానే (30) సంయయనంతో ఆడుతుండగా, వన్‌డౌన్‌ బ్యాటర్‌ నితీశ్‌ రాణా ( 13 బంతుల్లో 20) ధాటిగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం కేకేఆర్‌ స్కోరు 9 ఓవర్లలో 70/1. శ్రేయస్‌ సేన విజయం సాధించాలంటే 66 బంతుల్లో 62 పరుగులు అవసరం.

  • 26 Mar 2022 10:08 PM (IST)

    మొదటి వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌.. వెంకటేశ్‌ అయ్యర్‌ ఔట్‌..

    కోల్‌కతా జట్టు మొదటి వికెట్‌ కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న వెంకటేశ్‌ అయ్యర్‌ (16)ను బ్రేవో బోల్తా కొట్టించాడు. ఇతని బౌలింగ్‌లో ఎం.ఎస్‌.ధోనికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు అయ్యర్‌. ప్రస్తుతం క్రీజులో అజింక్యా రహానే (27), నితీశ్‌ రాణా (6) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కోల్‌కతా స్కోరు 7.3 ఓవర్లలో 50/1.

  • 26 Mar 2022 09:56 PM (IST)

    నిలకడగా కేకేఆర్ బ్యాటింగ్.. ప్రస్తుతం స్కోరెంతంటే..

    132 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిలకడగా బ్యాటింగ్‌ చేస్తోంది. ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. అజింక్యా రహానే ( 15 బంతుల్లో 17), వెంకటేశ్‌ అయ్యర్‌ (12 బంతుల్లో 13) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం కేకేఆర్‌ స్కోరు 5 ఓవర్లకు గాను 35/0.

  • 26 Mar 2022 09:19 PM (IST)

    కోల్‌కతా టార్గెట్ 132

    టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా ముందు 132 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఎంఎస్ ధోనీ (50 పరుగులు, 38 బంతులు, 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో అద్భుతంగా ఆకట్టుకున్నాడు.

  • 26 Mar 2022 08:51 PM (IST)

    15 ఓవర్లకు చెన్నై టీం స్కోర్..

    15 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై సూపర్ కింగ్స్ టీం 5 వికెట్లు కోల్పోయి 73 పరుగులు పూర్తి చేసింది. రవీంద్ర జడేజా 13, ధోనీ 7 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఉమేష్ యాదవ్ 2, చక్రవర్తి, రస్సెల్ తలో వికెట్ పడగొట్టారు.

  • 26 Mar 2022 08:30 PM (IST)

    ఐదో వికెట్ డౌన్..

    టాస్ ఓడిన్ చెన్నై టీం వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతు కష్టాల్లో కూరకపోతోంది. కోల్‌కతా బౌలర్ల ముందు సత్తా చాటలేక పెవిలియన్ చేరుతున్నారు. 10.5వ ఓవర్‌లో శివం దూబే(3) రస్సెల్ బౌలింగ్‌లో నరైన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో చెన్నై టీం 10.5 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 61 పరగులు చేసింది.

  • 26 Mar 2022 08:25 PM (IST)

    10 ఓవర్లకు చెన్నై టీం స్కోర్..

    10 ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై సూపర్ కింగ్స్ టీం 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు పూర్తి చేసింది. రవీంద్ర జడేజా 6, శివం దూబే 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఉమేష్ యాదవ్ 2, చక్రవర్తి 1 వికెట్ పడగొట్టారు.

  • 26 Mar 2022 08:17 PM (IST)

    నాలుగో వికెట్ డౌన్..

    టాస్ ఓడిన్ చెన్నై టీం పూర్తిగా కష్టాల్లోకి కూరకపోతోంది. వరుసగా వికెట్లు కోల్పోతూ కోల్‌కతా బౌలర్ల ముందు సత్తా చాటలేకపోతున్నారు. 8.4వ ఓవర్‌లో రాయుడు(15) రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో చెన్నై టీం 8.4 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 52 పరగులు చేసింది.

  • 26 Mar 2022 08:11 PM (IST)

    కష్టాల్లో చెన్నై సూపర్ కింగ్స్..

    కోల్‌కతా బౌలర్ల దెబ్బకు చెన్నై బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరుతున్నారు. ఆదిలోనే ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు తీసి, జడేజా సేనను ఒత్తిడిలోకి నెట్టగా, వరుణ్ చక్రవర్తి తన మొదటి ఓవర్‌లోనే రాబిన్ ఊతప్ప(28)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 7.5 ఓవర్లకు చెన్నై టీం 3 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది.

  • 26 Mar 2022 08:02 PM (IST)

    6 ఓవర్లకు చెన్నై టీం స్కోర్..

    ఆరు ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై సూపర్ కింగ్స్ టీం రెండు వికెట్లు కోల్పోయి 35 పరుగులు పూర్తి చేసింది. రాబిన్ ఊతప్ప 23, రాయుడు 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఉమేష్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు.

  • 26 Mar 2022 07:56 PM (IST)

    ఉమేష్ యాదవ్ దెబ్బకు రెండో వికెట్ డౌన్..

    ఉమేష్ యాదవ్ దెబ్బకు చెన్నై టీం బ్యాటర్లు విలవిల్లాడుతున్నారు. ఇప్పటికే రుతురాజ్‌ను పెవిలియన్ చేర్చిన ఉమేష్.. 4.1 ఓవర్లలో కాన్వే(3)ను ఔట్ చేశాడు. దీంతో చెన్నై టీం 28 పరుగులకు 2వ వికెట్‌ను కోల్పోయింది.

  • 26 Mar 2022 07:49 PM (IST)

    3 ఓవర్లకు చెన్నై టీం స్కోర్..

    మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి చెన్నై సూపర్ కింగ్స్ టీం ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు పూర్తి చేసింది. రాబిన్ ఊతప్ప 11, డేవాన్ కాన్వే 2 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 26 Mar 2022 07:45 PM (IST)

    తొలి సిక్స్..

    చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ రాబిన్ఊతప్ప క్రీజులోకి రాగానే బౌండరీలతో దూసుకెళ్తున్నాడు. 8 బంతులు ఎదుర్కొన్న ఊతప్ప, ఒక సిక్స్, ఒక్ ఫోర్‌తో 10 పరుగులు పూర్త చేశాడు.

  • 26 Mar 2022 07:40 PM (IST)

    CSK vs KKR: తొలి వికెట్ డౌన్..

    ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో చెన్నై టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. టీం 2 పరుగుల వద్ద రుతురాజ్ గైక్వాడ్(0) నితీష్ రాణాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

  • 26 Mar 2022 07:40 PM (IST)

    STAT: IPL కెప్టెన్‌ కాక ముందు ఆడిన మ్యాచుల వివరాలు

    కెప్టెన్‌గా వ్యవహరించడానికి ముందు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు..

    200 R జడేజా

    153 M పాండే

    137 K పొలార్డ్

    111 R అశ్విన్

    107 S శాంసన్

    103 భువనేశ్వర్

  • 26 Mar 2022 07:29 PM (IST)

    ఇది చాలా పెద్ద బాధ్యత: జడేజా

    టాస్‌ తరువాత జడేజా మాట్లాడుతూ, “ఇది చాలా పెద్ద బాధ్యత. నేను ఈ కొత్త పాత్రకు సిద్ధంగా ఉన్నాను. ఉత్సాహంగా ఉన్నాను. ప్రిపరేషన్ బాగుంది. అంతా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

  • 26 Mar 2022 07:08 PM (IST)

    చెన్నై ప్లేయింగ్ ఎలెవన్

    చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా(కెప్టెన్), శివమ్ దూబే, ఎంఎస్ ధోని(కీపర్), డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, తుషార్ దేశ్‌పాండే

  • 26 Mar 2022 07:07 PM (IST)

    కోల్‌కతా ప్లేయింగ్ ఎలెవన్..

    కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్(కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షెల్డన్ జాక్సన్, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి

  • 26 Mar 2022 07:04 PM (IST)

    టాస్ గెలిచిన కోల్‌కతా..

    ఐపీఎల్ 2022లో భాగంగా నేడు జరుగుతోన్న తొలి మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ టీం టాస్ గెలిచింది. ఈ మేరకు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ టీం బ్యాటింగ్‌కు రానుంది.

  • 26 Mar 2022 06:48 PM (IST)

    కొత్త కెప్టెన్‌తో కోల్‌కతా..

    కోల్‌కతా నైట్ రైడర్స్ టీం ఈసారి కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగనుంది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో రెండుసార్లు విజేతగా నిలిచాడు. అయ్యర్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి విజయం సాధించాడు. అతని కెప్టెన్సీలో ఢిల్లీ 2020లో తొలిసారి ఫైనల్ ఆడింది. కానీ, గెలవలేకపోయింది. అయ్యర్ తమ టైటిల్ కరువును ఈసారి ముగించాలని కోల్‌కతా భావిస్తోంది.

  • 26 Mar 2022 06:43 PM (IST)

    తొలిసారి సాధారణ ఆటగాడిగా ధోని..

    చెన్నై సూపర్ కింగ్స్‌లో ఈసారి భారీ మార్పు కనిపించింది. 2008 నుంచి చెన్నైకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఈ సీజన్‌లో కెప్టెన్సీ వహించడం లేదు. తన సారథ్యంలో చెన్నైని నాలుగుసార్లు విజేతగా నిలిపిన ధోనీ.. రెండు రోజుల క్రితం కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు. ఈసారి చెన్నైని విజేతగా నిలబెట్టే బాధ్యత జడేజాపై నిలిచింది.

  • 26 Mar 2022 06:41 PM (IST)

    కొత్త ఫార్మాట్‌లో ఐపీఎల్..

    ఐపీఎల్ ఈసారి కొత్త ఫార్మాట్‌లో కనిపించనుంది. ఈసారి ఈ లీగ్‌లో ఎనిమిది జట్లు కాకుండా 10 జట్లు పాల్గొంటున్నాయి. అలాగే, ఈ లీగ్‌ను కొత్త ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఈసారి మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరిగింది.

  • 26 Mar 2022 06:40 PM (IST)

    క్రికెట్ పండుగ ప్రారంభం..

    ఐపీఎల్ క్రికెట్ పండుగ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ నిరీక్షణ మరికొద్ది గంటల్లో ముగియనుంది. ఐపీఎల్-2022 తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి.

Published On - Mar 26,2022 6:33 PM

Follow us
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.