V C Sajjanar: ఐపీఎల్ టోర్నీలో భాగంగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో మొదటి బంతికే ఔటయ్యాడు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు కింగ్ కోహ్లీ (Virat Kohli). ఆ సమయంలో విరాట్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌పై సోషల్ మీడియాలో బాగా వైరలైంది. అసలే పేలవఫామ్‌తో సతమతమవుతున్న కోహ్లి ఈ మ్యాచ్‌లోనైనా రాణించాలని భావించి, గోల్డెన్ డక్ కావడంతో ఎంతో నిర్వేదంతో పెట్టిన ఆ ఎక్స్‌ప్రెషన్స్ చూసి అతని అభిమానులను బాగా ఎమోషనల్ అయ్యారు. ఇక తొందర్లోనే వింటేజ్ (పాత) విరాట్‌ను చూస్తామంటూ ఆశాభావం వ్యక్తం చేస్తూ నెట్టింట్లో మీమ్స్ తో హల్‌చల్ చేశారు నెటిజన్లు. ఈక్రమంలో టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (V C Sajjanar) కూడా కోహ్లీ హావభావాలపై ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.
మాకు కూడా అనుభవమే..
కోహ్లి ఎక్స్‌ప్రెషన్స్‌కు సంబంధించిన ఫొటోను తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసిన సజ్జనార్.. ‘ కండక్టర్ వచ్చి పాస్ అడిగినప్పుడు, బస్ పాస్ ఇంట్లో మర్చిపోయిన మన రియాక్షన్.. మీరు ఎప్పుడైనా పాస్ మర్చిపోయి బస్ ఎక్కారా?.. మీ అనుభవాలను మాతో షేర్ చేసుకోండి’ అంటూ ఫన్నీగా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ‘మేం కూడా 2-3 సార్లు బస్ పామ్ మర్చిపోయి బస్ ఎక్కాం. చేసేదేమిలేక టికెట్‌ను తీసుకున్నాం’ అంటూ నెటిజన్లు కూడా తమ అనుభవాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. కాగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సజ్జనార్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారిపోయారు. సినిమా పాటలు, డైలాగులతో ఆర్టీసీని వివిధ రూపాల్లో ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా కోహ్లీ ఎక్స్‌ప్రెషన్‌ను కూడా వాడేశారు.
Share your experiences with us#RCBvsLSG #ViratKohli? #Virat #IPL20222 #CricketTwitter pic.twitter.com/5J92QzFFtT
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) April 20, 2022