KL Rahul-Athiya Shetty: త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న ప్రేమజంట!.. సౌత్ ఇండియన్ స్టైల్‌లోనే గ్రాండ్ వెడ్డింగ్!
KL Rahul-Athiya Shetty Wedding: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul), బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి అతియాశెట్టి (Athiya Shetty) గత కొన్ని రోజులుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు
KL Rahul-Athiya Shetty Wedding: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul), బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి అతియాశెట్టి (Athiya Shetty) గత కొన్ని రోజులుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. పెద్దలు కూడా వీరి ప్రేమను ఆశీర్వదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ ప్రేమబంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకునే ఆలోచనలో ఉన్నారట ఈ లవ్‌బర్డ్స్. ఇందులో భాగంగా త్వరలోనే వివాహ బంధంతో వీరు ఏకం కానున్నారట. అన్నీ కుదిరితే ఈ ఏడాది వింటర్ సీజన్‌లోనే రాహుల్- అతియాల పెళ్లి జరుగుతుందట. ‘అతియా శెట్టి, కేఎల్ రాహుల్ పెళ్లికి ఇరు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే వీరి పెళ్లి సన్నాహకాలు ప్రారంభమయ్యాయి. అన్నీ కుదిరితే ఈ ఏడాది పూర్తయ్యేలోపు వారు పెళ్లి చేసుకోవచ్చు’ అని శెట్టి కుటుంబ సన్నిహితులు చెబుతున్నారట.
దక్షిణాది స్టైల్‌లోనే.. కాగా సునీల్ శెట్టి బాలీవుడ్ హీరో అయినప్పటికీ అతని పూర్వీకులు దక్షిణాదికి చెందిన వారే. ముల్కిలోని మంగళూరుకు చెందిన తుళు మాట్లాడే కుటుంబంలో జన్మించాడు సునీల్ శెట్టి. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా మంగళూరు ప్రాంతానికి చెందిన వాడే. ఈక్రమంలో అతియా, రాహుల్ వివాహాన్ని కూడా సౌత్ ఇండియన్ వెడ్డింగ్ స్టైల్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ లక్నో జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు రాహుల్. ఆటగాడిగా, కెప్టెన్‌గా ఆజట్టును విజయాల బాట పట్టిస్తున్నాడు. ఇక అతియా కూడా ఐపీఎల్ లో సందడి చేస్తోంది. రాహుల్ ఆడే మ్యాచ్‌లన్నింటికీ హాజరవుతూ అతనిని ప్రోత్సహిస్తుంటుంది.
View this post on Instagram
Also Read; Viral News: అమ్మాయితో లేచిపోయిన యువకుడు.. కోర్టు ఇచ్చిన షాక్‌కు బిత్తరపోయాడు..!
Telangana: నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు.. ముందుగా 72 వేల ఉద్యోగాల భర్తీ.. మంత్రి కీలక ప్రకటన
Health Tips: కొలస్ట్రాల్ తగ్గాలంటే ఈ ఆహార చిట్కాలు పాటించండి..!