Watch Video: నెట్స్‌లో రఫ్పాడించిన అర్జున్ టెండూల్కర్.. మనోడి బౌలింగ్ అట్లుంటది మరి..
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) కష్టాల్లో కూరుకపోయంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. ఈ సీజన్‌లో జట్టు బౌలింగ్ చాలా నిరాశపరిచింది.
Arjun Tendulkar: ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) కష్టాల్లో కూరుకపోయంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. ఈ సీజన్‌లో జట్టు బౌలింగ్ చాలా నిరాశపరిచింది. ఇదిలా ఉంటే , ప్లేయింగ్ ఎలెవన్‌లో అర్జున్ టెండూల్కర్ ను తీసుకోవాలనే డిమాండ్ పెరిగింది. చాలా మంది అభిమానులు సోషల్ మీడియాలో ఇలాంటి డిమాండ్లు చేస్తున్నారు. ఐపీఎల్ 2022(IPL 2022) లో ముంబై బౌలింగ్ దారుణంగా మారింది. అందుకే, అర్జున్‌కి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ యువ బౌలర్ కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. అర్జున్ టెండూల్కర్ వేసిన యార్కర్‌పై బ్యాట్స్‌మెన్ బౌల్డయిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
వీడియోను పోస్ట్ చేస్తూ, ముంబై ‘మీ పేరు అర్జున్ అయితే, మీరు లక్ష్యాన్ని కోల్పోరు’ అని రాసుకొచ్చింది. నెట్ ప్రాక్టీస్‌లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కి అర్జున్ బౌలింగ్ చేయడం ఇందులో కనిపిస్తోంది. అతను బంతిని ఆఫ్, మిడిల్‌కి యార్క్ చేస్తాడు. బ్యాట్స్‌మెన్ ఆఫ్-స్టంప్‌ను షేక్ చేస్తాడు. ఈ బంతికి బ్యాట్స్‌మన్ వద్ద సమాధానం లేదు. అర్జున్ కూడా ఈ బంతిని చూసి చాలా సంతోషించాడు. సంబరాలు చేసుకోవడం చూడవచ్చు. అయితే, ఏ బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేస్తున్నాడనే దానిపై స్పష్టత లేదు.
అర్జున్ రెండోసారి ముంబైలో భాగమయ్యాడు..
అర్జున్ టెండూల్కర్ రెండోసారి ఐపీఎల్‌లో భాగమయ్యాడు. IPL 2022 వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 30 లక్షలకు అతడిని ఎంపిక చేసింది. ముంబైతో పాటు గుజరాత్ టైటాన్స్ కూడా అతని కోసం పందెం కాసింది. గతంలో కూడా ముంబైలో భాగంగా ఉన్నాడు. ఐపీఎల్ 2021 వేలంలో అతడిని రూ. 20 లక్షల బేస్ ప్రైస్‌తో ముంబై తీసుకుంది. అయితే అప్పుడు ఆడలేకపోయాడు. గాయం కారణంగా మిడిల్ టోర్నీ నుంచి ఇంటికి వెళ్లిపోయాడు.
ముంబై బౌలర్లు విఫలమయ్యారు..
ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా లేకుండానే ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో అంటే పదిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అర్జున్‌కి ఆడే అవకాశం దక్కుతుందనే నమ్మకం ఉంది. తమల్ మిల్స్, జయదేవ్ ఉనద్కత్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్ వంటి బౌలర్లు ముంబైని చాలా నిరాశపరిచారు. వారి బంతుల్లో చాలా పరుగులు రాలుతున్నాయి. వికెట్లు కూడా తీయలేకపోయారు. దీంతో ముంబై ఈసారి మిగతా జట్ల కంటే వెనుకబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ముంబై తన యువ బౌలర్‌కు చోటు కల్పిస్తుందని భావిస్తున్నారు.
View this post on Instagram