AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: పాయింట్ల పట్టికలో మరింత దిగజారిన పంజాబ్‌ ప్లేస్‌.. ఆరెంజ్‌, పర్పుల్‌ క్యాప్‌లు ఎవరి వద్ద ఉన్నాయంటే..

IPL 2022 Points Table: బయోబబుల్‌లో కరోనా కేసులు వెలుగు చూస్తున్నా ఐపీఎల్‌-2022 సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో (DC vs PBKS) పంజాబ్‌ కింగ్స్‌ పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్‌

IPL 2022: పాయింట్ల పట్టికలో మరింత దిగజారిన పంజాబ్‌ ప్లేస్‌.. ఆరెంజ్‌, పర్పుల్‌ క్యాప్‌లు ఎవరి వద్ద ఉన్నాయంటే..
Ipl 2022
Basha Shek
| Edited By: Phani CH|

Updated on: Apr 21, 2022 | 9:45 AM

Share

IPL 2022 Points Table: బయోబబుల్‌లో కరోనా కేసులు వెలుగు చూస్తున్నా ఐపీఎల్‌-2022 సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో (DC vs PBKS) పంజాబ్‌ కింగ్స్‌ పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్‌. తద్వారా ప్లే ఆఫ్‌ రేసులో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది రిషభ్‌ సేన. ఇప్పటివరకు మొత్తం 6 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 3 విజయాలు నమోదు చేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టిక (IPL 2022 Points Table) లో 8వ స్థానం నుంచి 6వ స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమితో 7వ స్థానంలో ఉన్న మయాంక్‌ సేన 8వ స్థానానికి దిగజారింది. మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ మూడింటిలో విజయం సాధించగా నాలుగింటిలో ఓటమిపాలైంది.

చెక్కుచెదరని అగ్రస్థానం..

ఇక మిగతా జట్ల విషయానికొస్తే.. గుజరాత్ టైటాన్స్‌ (6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) రెండో ప్లేసులో ఉంది. రాజస్థాన్‌ రాయల్స్‌ (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) మూడో స్థానంలో ఉండగా, కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని లక్నో సూపర్‌ జెయింట్స్‌ ( 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) నాలుగో ప్లేస్‌లో ఉంది. కేన్‌ విలియమ్సన్‌ సారథ్యంలోని సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) ఐదో ప్లేస్‌లో ఉంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఏడో స్థానం, చెన్నై సూపర్‌ కింగ్స్‌ (6 మ్యాచ్‌ల్లో ఒక గెలుపు) తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాయి. విజయాల ఖాతా తెరవని ముంబై అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది.

అతని దగ్గరే ఆరెంజ్‌ క్యాప్‌..

ఇక టోర్నీలో అత్యధిక పరుగులు చేసే వారికిచ్చే ఆరెంజ్‌ క్యాప్ రాజస్థాన్‌ ఆటగాడు జోస్ బట్లర్‌ ( 6 మ్యాచ్‌ల్లో 375 పరుగులు) వద్దనే ఉంది. అతనికి పోటీగా కేఎల్ రాహుల్‌ (7 మ్యాచ్‌ల్లో 265 రన్స్‌), డుప్లెసిస్‌ (7 మ్యాచ్‌ల్లో 250 పరుగులు) 2,3వ స్థానాల్లో ఉన్నారు.

స్పిన్నర్లదే హవా..

ఇక పర్పుల్‌ క్యాప్‌ విషయానికొస్తే.. రాజస్థాన్‌ స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్ ( 6 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) టాప్‌ ప్లేస్‌ లో ఉన్నాడు. ఢిల్లీ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (6 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు), హైదరాబాద్‌ బౌలర్‌ టి.నటరాజన్‌ (6 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు) 2,3 స్థానాల్లో కొనసాగుతున్నారు.

Also Read:Road Accident: వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా విషాదం.. చెట్టును ఢీకొన్న జీపు.. అక్కడికక్కడే ఆరుగురు మృతి.. Sri Lanka: మరింతగా రగిలిపోతున్న లంక.. 3,800 కోట్ల డాలర్ల ఆర్ధిక సాయం ప్రకటించిన భారత్..

Telangana: నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు.. ముందుగా 72 వేల ఉద్యోగాల భర్తీ.. మంత్రి కీలక ప్రకటన