Road Accident: వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా విషాదం.. చెట్టును ఢీకొన్న జీపు.. అక్కడికక్కడే ఆరుగురు మృతి..
Karnataka: కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించంది. హున్‌సూర్‌లోని కల్లహల్లి సమీపంలో ఓ జీపు రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది.
Karnataka: కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించంది. హున్‌సూర్‌లోని కల్లహల్లి సమీపంలో ఓ జీపు రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కొడుగులో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొని మైసూర్ తిరిగి వెళ్తుండగా ఈ ఘోర దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు పోలిబెట్టకు చెందిన అనిల్, సంతోష్, రాజేష్, వినూత్, బాబు, దయానంద్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోకి ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు.
కాగా వీరంతా రెండు వాహనాల్లో వివాహ వేడుకకు బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా ఒకే కారులో, మహిళలు, చిన్న పిల్లలు మరో కారులో ఉన్నారని వారు తెలిపారు. ప్రమాదవశాత్తూ జీపు చెట్టును ఢీకొట్టడం వల్ల డ్రైవర్‌తో సహా మొత్తం ఆరుగురు మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదంపై కేసు నమోదుచేశామన్నారు.
VK Sasikala: శశికళను చుట్టుముడుతున్న కష్టాలు.. పోలీసుల నుంచి మళ్లీ పిలుపు.. ఎందుకోసమంటే..!