Telangana: నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు.. ముందుగా 72 వేల ఉద్యోగాల భర్తీ.. మంత్రి కీలక ప్రకటన

నిరుద్యోగులకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. మొదటి విడతలో సుమారు 72వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ కానున్నాయని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabita Indrareddy) తెలిపారు. పోలీసు, విద్య, వైద్య శాఖల్లో ఈ ఖాళీలు....

Telangana: నిరుద్యోగులకు సర్కార్ తీపి కబురు.. ముందుగా 72 వేల ఉద్యోగాల భర్తీ.. మంత్రి కీలక ప్రకటన
Minister Sabita
Follow us

|

Updated on: Apr 20, 2022 | 9:36 PM

నిరుద్యోగులకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. మొదటి విడతలో సుమారు 72వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ కానున్నాయని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabita Indrareddy) తెలిపారు. పోలీసు, విద్య, వైద్య శాఖల్లో ఈ ఖాళీలు ఉన్నాయని, మొదటగా వీటిని భర్తీ చేయాలని సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశించారన్నారు. తద్వారా ఒక ఉద్యోగం రాకపోతే మరో ఉద్యోగానికి ప్రయత్నించే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. ఉద్యోగాలు పొందాలని యువత ఎదురు చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో నియోజకవర్గాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు. 91 వేల ఉద్యోగాల ప్రకటన చేసేముందు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసిందని మంత్రి సబితా వెల్లడించారు. ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన పోటీ పరీక్షల ఉచిత శిక్షణ కేంద్రాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. విశ్వవిద్యాలయాల్లోని శిక్షణ కేంద్రాల్లో విద్యార్థులకు మెటీరియల్ కూడా ఉచితంగా అందించాలని అధికారులను ఆదేశించారు. శ్రమ ఆయుధమైతే.. విజయం బానిస అవుతుందన్న స్ఫూర్తితో విద్యార్థులు కష్టపడి ఉద్యోగాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11,103 ఒప్పంద ఉద్యోగులకు క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా 95 శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని సీఎం పేర్కొన్నారు. అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఐదు శాతం మాత్రమే స్థానికేతరులకు వస్తాయని వివరించారు. నియామకాల్లో 95 శాతం స్థానిక కోటా సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని సీఎం తెలిపారు.

Also Read

VK Sasikala: శశికళను చుట్టుముడుతున్న కష్టాలు.. పోలీసుల నుంచి మళ్లీ పిలుపు.. ఎందుకోసమంటే..!

Health Tips: మళ్లీ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని పాటించాల్సిందే..!

Viral Video: కొన్ని నెలలపాటు ద్రాక్షపండ్లను తాజాగా ఉంచాలా.. ఫ్రిజ్ అవసరమే లేని నాచురల్ పద్ధతి.. వైరల్ వీడియో..