AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan Royals: సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌లో కొనసాగేనా? ఆ ఆటగాళ్ల భవిష్యత్తుపై ఫ్రాంఛైజీ కీలక నిర్ణయం..!

IPL 2022: 2008లో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ తొలి సీజన్ టైటిల్‌ను గెలుచుకుంది. అయితే ఆ తర్వాత ఈ జట్టు మళ్లీ ట్రోఫీని అందుకోలేకపోయింది.

Rajasthan Royals: సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌లో కొనసాగేనా? ఆ ఆటగాళ్ల భవిష్యత్తుపై ఫ్రాంఛైజీ కీలక నిర్ణయం..!
Sanju Samson
Venkata Chari
|

Updated on: Nov 26, 2021 | 8:38 AM

Share

IPL 2022, Rajasthan Royals: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు చేరడంతో తదుపరి సీజన్ భిన్నంగా ఉంటుంది. ఇందుకోసం మెగా ఆక్షన్‌ను నిర్వహించాల్సి ఉండగా.. దీనికి ముందు ఈ సమయంలో అన్ని ఫ్రాంచైజీలు అదే పనిలో నిమగ్నమయ్యాయి. అంటే ఆటగాళ్లను నిలబెట్టుకునేందుకు టీంలు తమ తుది ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక్కో ఫ్రాంచైజీ కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోగలదు. 2008లో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న రాజస్థాన్ రాయల్స్ తమ కెప్టెన్, యువ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌ను కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో వెబ్‌సైట్ సమాచారం మేరకు.. రూ.14 కోట్లతో సంజూను తన వద్దే ఉంచుకోవాలని రాజస్థాన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ ఫ్రాంచైజీ నుంచి 2018లో ఎనిమిది కోట్ల రూపాయలకు శాంసన్ రాజస్థాన్‌కు వచ్చాడు. రిటెన్షన్ విండో నవంబర్ 30న ముగుస్తుంది. రాజస్థాన్ ఆటగాళ్లలో మొదటగా శాంసన్ పేరు వినిపిస్తోంది. మిగిలిన మూడు స్థానాల్లో జోస్ బట్లర్, ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్, యశస్వి జైస్వాల్ ఉన్నారు. ఫ్రాంఛైజీ వీరిలో ఏ ముగ్గురుని తమ వద్ద ఉంచుకుంటుందో చూడాలి.

బెన్ స్టోక్స్ పేరు లేదు.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ విషయంలో పరిస్థితి స్పష్టంగా లేదు. రూ. 12.5 కోట్లకు అతడిని ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. 2021లో క్రికెట్‌కు సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. ప్రస్తుతం శిక్షణతో పూర్తి ఫిట్‌నెస్‌తో యాషెస్‌ సిరీస్‌కు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం, ఒక ఫ్రాంచైజీ నలుగురు ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. అందులో ఇద్దరు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఉంటారు. జోస్ బట్లర్‌ను రూ. 4.4 కోట్లకు, ఆర్చర్‌ను రూ. 7.2 కోట్లకు ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఆర్చర్ 2020లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా కూడా ఎంపికయ్యాడు. అయితే గాయం కారణంగా గత సీజన్‌లో ఆడలేకపోయాడు. అదే సమయంలో, స్టోక్స్ కూడా గత సీజన్‌లో ఆడలేదు. మరి స్టోక్స్ విషయంలో ఫ్రాంచైజీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. నవంబర్ 28న మిగిలిన మూడు రిటెన్షన్‌లపై రాజస్థాన్ జట్టు తుది నిర్ణయం తీసుకోవచ్చు.

ఎన్ని మార్పులు చేసినా.. ఫైనల్ చేరట్లే? ఐపీఎల్-2021లో రాజస్థాన్ రాణించలేదు. ఆ జట్టు 14 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో మాత్రమే విజయం సాధించగా, తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. 2008లో షేన్ వార్న్ కెప్టెన్సీలో రాజస్థాన్ తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అయితే అప్పటి నుంచి ఆ జట్టు ఫైనల్‌కు కూడా చేరుకోలేదు. ఈ సమయంలో జట్టు తన నాయకత్వంలో పలు కీలక మార్పులు చేసినా విజయం సాధించలేదు.

Also Read: IND VS NZ: టీమిండియాలో వీరిద్దరి సమయం ముగిసినట్టేనా.. కుర్రాళ్ల రాకతో కఠినమైన చోటు.. ద్రవిడ్‌ కూడా ఇక హ్యాండిచ్చేనా?

IPL 2022: వద్దంటోన్న ముంబై.. రమ్మంటోన్న కొత్త టీం.. సోదరులు చేరేది ఆ గూటికేనా? ఇషాన్‌, సూర్యకుమార్‌‌లలో నిలిచేది ఒక్కరే