AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tim Paine: క్రికెట్‎కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న టిమ్ పైన్..! ఎందుకంటే..

ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ టిమ్ పైన్ అన్ని ఫార్మట్లకు కొద్ది రోజులు దూరంగా ఉంటాడని క్రికెట్ టాస్మానియా శుక్రవారం తెలిపింది. సెక్స్‌టింగ్ కుంభకోణంతో అతను టెస్ట్ కెప్టెన్‌గా వైదొలిగాడు.

Tim Paine: క్రికెట్‎కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న టిమ్ పైన్..! ఎందుకంటే..
Pain
Srinivas Chekkilla
|

Updated on: Nov 26, 2021 | 8:51 AM

Share

ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ టిమ్ పైన్ అన్ని ఫార్మట్లకు కొద్ది రోజులు దూరంగా ఉంటాడని క్రికెట్ టాస్మానియా శుక్రవారం తెలిపింది. సెక్స్‌టింగ్ కుంభకోణంతో అతను టెస్ట్ కెప్టెన్‌గా వైదొలిగాడు. నిర్ణయం అతను యాషెస్‌లో పాల్గొనాలా వద్దా అనే చర్చకు ముగింపు పలికింది. డిసెంబర్ 8న బ్రిస్బేన్‌లో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ” గత 24 గంటల చర్చల తరువాత, టిమ్ పైన్ క్రికెట్ టాస్మానియాకు సమాచారం ఇచ్చాడు. 2017లో ఒక మహిళా సహోద్యోగితో లైంగికంగా గ్రాఫిక్ టెక్స్ట్ మెసేజ్‌ల మార్పిడి జరిగిందని బహిరంగంగా వెల్లడించినందుకు టాస్మానియన్ కీపర్ వారం క్రితం టెస్ట్ కెప్టెన్‌గా నిష్క్రమించాడు.

కానీ కెప్టెన్‌గా వైదొలిగేటప్పుడు, ఆ సమయంలో తాను ఆస్ట్రేలియా టెస్టు జట్టులో “నిబద్ధతతో కూడిన సభ్యుడు”గా ఉండాలనుకుంటున్నానని పైన్ చెప్పాడు. యాషెస్ పర్యటన కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ మార్కస్ హారిస్ బుధవారమే పైన్‌కు ఆస్ట్రేలియా జట్టు పూర్తి మద్దతు ఉందని చెప్పాడు. తొలి టెస్టుకు తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి అర్హుడని పేర్కొన్నాడు. పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్‌ కొత్త కెప్టెన్సీ రేసులో ఉన్నారు. కొత్త టెస్ట్ కెప్టెన్‌ను ఐదుగురు వ్యక్తుల ప్యానెల్ నిర్ణయించనుంది. టిమ్​ పైన్​పై వచ్చిన ఆరోపణల ప్రభావం యాషెస్​ సిరీస్​పై తీవ్రంగా ఉంటుందని అన్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. పైన్​ స్థానంలో వికెట్ కీపర్​గా అలెక్స్​ కేరీ ఎంపికయ్యే అవకాశాలున్నాయని అన్నాడు. మార్చి 2018లో కెప్టెన్‌గా పైన్ బాధ్యతలు స్వీకరించాడు.

Read Also.. IND VS NZ: టీమిండియాలో వీరిద్దరి సమయం ముగిసినట్టేనా.. కుర్రాళ్ల రాకతో కఠినమైన చోటు.. ద్రవిడ్‌ కూడా ఇక హ్యాండిచ్చేనా?

ఎంతకు తెగించావ్‌రా.. అందరి ముందు సొంత తమ్ముడినే దారుణంగా..
ఎంతకు తెగించావ్‌రా.. అందరి ముందు సొంత తమ్ముడినే దారుణంగా..
బోడో సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ.. వీడియో
బోడో సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ.. వీడియో
ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే