AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: ఆ టీమిండియా ప్లేయర్ ధర పెరిగింది.. వేలంలోకి కొత్తగా మరో పదిమంది..?

IPL 2022: IPL 2022 వేలానికి కొన్ని గంటల ముందు పెద్ద అప్‌డేట్ వచ్చింది. భారత జట్టులో అరంగేట్రం చేసిన ఆల్ రౌండర్ దీపక్ హుడా బేస్ ధర ఒక్కసారిగా పెరిగింది. నిజానికి

IPL 2022: ఆ టీమిండియా ప్లేయర్ ధర పెరిగింది.. వేలంలోకి కొత్తగా మరో పదిమంది..?
Deepak Hooda
uppula Raju
|

Updated on: Feb 12, 2022 | 9:27 AM

Share

IPL 2022: IPL 2022 వేలానికి కొన్ని గంటల ముందు పెద్ద అప్‌డేట్ వచ్చింది. భారత జట్టులో అరంగేట్రం చేసిన ఆల్ రౌండర్ దీపక్ హుడా బేస్ ధర ఒక్కసారిగా పెరిగింది. నిజానికి దీపక్ హుడా IPL వేలంలో పేరు నమోదు చేసినప్పుడు అన్‌క్యాప్డ్ ఆటగాడు. కానీ ఇప్పుడు అంతర్జాతీయ అరంగేట్రం చేసి క్యాప్డ్ ప్లేయర్‌గా మారాడు. దీపక్ హుడా బేస్ ధర రూ.40 లక్షలు కాగా ఇప్పుడు రూ.75 లక్షలకు పెరిగింది. ఒక్కసారిగా రూ.35 లక్షలు పెరిగింది. చాలా జట్లు అతనిపై పందెం వేయడానికి సిద్దంగా ఉన్నాయి.

శుక్రవారం రాత్రి IPL ఫ్రాంచైజీలకు కొత్త లిస్టుని సమర్పించారు. ఇందులో మొత్తం 600 మంది పేర్లు ఉన్నాయి. కొత్తగా 10 మంది ఆటగాళ్లు కలిసారు. ఇంతకు ముందు 590 మంది ఆటగాళ్లు షార్ట్‌లిస్ట్ చేశారు. కొత్తగా చేరిన 10 మంది ఆటగాళ్లు అన్‌క్యాప్‌ ఆటగాళ్లు. వీరిలో ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కాగా ఏడుగురు భారతీయులు. ఆస్ట్రేలియా ఆటగాళ్ల పేర్లలో ఆరోన్ హార్డీ, లాన్స్ మోరిస్, నివేతన్ రాధాకృష్ణన్ ఉన్నారు. నివేతన్ ఇటీవల అండర్-19 ప్రపంచకప్ ఆడాడు. నివేతన్‌లోని ప్రత్యేకత ఏంటంటే ఇతను రెండు చేతులతో స్పిన్ బౌలింగ్ చేయగలడు.

ఐపీఎల్ వేలం బెంగళూరులో రెండు రోజులు కొనసాగుతుంది. శనివారం మొత్తం 97 మంది ఆటగాళ్లు వేలం వేయనున్నారు. మొదటి 6 సెట్లలో 54 మంది క్యాప్డ్ ఆటగాళ్ల పేర్లు వస్తాయి. మొదటి 10 మార్క్యూ ప్లేయర్లు వేలం వేస్తారు. చివరి 5 సెట్లలో అన్ క్యాప్ చేయని ఆటగాళ్ల పేర్లు వెల్లడికానున్నాయి. 198 నుంచి 161 వరకు ఉన్న ఆటగాళ్ల పేర్లను ఆదివారం వేలం వేస్తారు.

చెన్నై సూపర్ కింగ్స్ 48 కోట్లతో రంగంలోకి దిగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ 47.5 కోట్లతో, కోల్‌కతా నైట్ రైడర్స్ 48 కోట్లతో వేలంలోకి ప్రవేశించబోతున్నాయి. గుజరాత్ టైటాన్స్ రూ.52 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.57 కోట్లు, లక్నో సూపర్ జెయింట్ రూ.59 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ రూ.62 కోట్లు, సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.68 కోట్లతో రంగంలోకి దిగనున్నాయి. పంజాబ్ కింగ్స్ అత్యధికంగా 72 కోట్లతో ముందుంది.

IPL 2022: రంగంలోకి దిగుతున్న ధోని.. ఏ ఏ ఆటగాళ్లని కొనుగోలు చేస్తున్నాడంటే..?

Bananas: అరటిపండ్లు తొందరగా పక్వానికి రావొద్దంటే ఏం చేయాలి.. వీటిని పాటిస్తే చాలు..?

UGC: కాలేజీ, యూనివర్సీటీలకు UGC కీలక ఆదేశాలు.. కొత్త మార్గదర్శకాలు విడుదల..