IPL 2022: రంగంలోకి దిగుతున్న ధోని.. ఏ ఏ ఆటగాళ్లని కొనుగోలు చేస్తున్నాడంటే..?

IPL 2022: చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయ రహస్యం మహేంద్ర సింగ్‌ ధోని. అద్భుతమైన కెప్టెన్, అద్భుతమైన బ్యాలెన్స్. నాలుగు సార్లు ఐపీఎల్‌ కప్పు అందించాడు. జట్టులోని ప్రతి

IPL 2022: రంగంలోకి దిగుతున్న ధోని.. ఏ ఏ ఆటగాళ్లని కొనుగోలు చేస్తున్నాడంటే..?
Ms Dhoni
Follow us

|

Updated on: Feb 12, 2022 | 9:07 AM

IPL 2022: చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయ రహస్యం మహేంద్ర సింగ్‌ ధోని. అద్భుతమైన కెప్టెన్, అద్భుతమైన బ్యాలెన్స్. నాలుగు సార్లు ఐపీఎల్‌ కప్పు అందించాడు. జట్టులోని ప్రతి ఆటగాడి ఎంపిక అతడు తీసుకున్న నిర్ణయమే. ఈ రోజు జరిగే ఐపీఎల్ 2022 వేలంలో ధోని ఏ ఏ ఆటగాళ్లని కొనుగోలు చేస్తాడో అని అందరు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ CEO కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ధోని అభిమానులను అస్సలు నిరాశపరచడని వెల్లడించాడు.

చెన్నై ఏ ఆటగాళ్లపై పందెం కాస్తుంది?

చెన్నై సూపర్ కింగ్స్ ఏ ఆటగాళ్లపై పందెం కాస్తుందో తెలియదు కానీ ధోని ఖచ్చితంగా తన జట్టులోని కొంతమంది పాత ఆటగాళ్లను కొనుగోలు చేస్తాడని తెలుస్తోంది. ఈ ఆటగాళ్లలో ఫాఫ్ డు ప్లెసిస్, అంబటి రాయుడు, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, జోష్ హేజిల్‌వుడ్, డ్వేన్ బ్రావో వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఆటగాళ్లు చెన్నై సూపర్ కింగ్స్‌ను బలమైన జట్టుగా మార్చారు. ఈ ఫ్రాంచైజీ వారిని అస్సలు మిస్‌ చేసుకోదు.

ఈ నలుగురు ఆటగాళ్లను రిటైన్‌

చెన్నై సూపర్ కింగ్స్ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో మొదటి పేరు రవీంద్ర జడేజా 16 కోట్లకు రిటైన్ అయ్యాడు. 12 కోట్లకు ఎంఎస్ ధోనిని రిటైన్ చేసుకున్నాడు. మొయిన్ అలీ 8, రీతురాజ్ గైక్వాడ్‌లను 6 కోట్లకు రిటైన్ చేసుకున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ 48 కోట్లతో రంగంలోకి దిగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ 47.5 కోట్లతో, కోల్‌కతా నైట్ రైడర్స్ 48 కోట్లతో వేలంలోకి ప్రవేశించబోతున్నాయి. గుజరాత్ టైటాన్స్ రూ.52 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.57 కోట్లు, లక్నో సూపర్ జెయింట్ రూ.59 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ రూ.62 కోట్లు, సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.68 కోట్లతో రంగంలోకి దిగనున్నాయి. పంజాబ్ కింగ్స్ అత్యధికంగా 72 కోట్లతో ముందుంది.