Virat Kohli: ఆ కారణంగా ఆర్సీబీ జట్టు నుంచి విడిపోవాలని… కెప్టెన్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు..
Virat Kohli RCB: టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించిన విరాట్ కోహ్లీ.. ఇప్పటిదాకా ఐపీఎల్‌లో మాత్రం కెప్టెన్‌గా సక్సెస్ సాధించలేకపోయాడు.
Virat Kohli RCB: టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించిన విరాట్ కోహ్లీ.. ఇప్పటిదాకా ఐపీఎల్‌లో మాత్రం కెప్టెన్‌గా సక్సెస్ సాధించలేకపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ సారధిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఆర్సీబీ కప్ కొట్టలేదు. ప్రతీ సీజన్ స్టార్టింగ్‌లో ‘ఈ సాలా కప్ నమదే’ అంటూ బరిలోకి దిగే బెంగళూరు జట్టు టోర్నమెంట్ చివరికి చేతులేత్తేస్తోంది.
ఇక గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయి ఇంటి దారి పట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ సీజన్‌లో ఎలాగైనా కప్ గెలవాలని కసి మీద ఉంది. ఈ క్రమంలోనే నిన్న డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి తొలి బోణీ కొట్టింది. ఈ నేపధ్యంలో ఆర్సీబీతో తనకున్న అనుబంధంపై విరాట్ కోహ్లీ తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.
”ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధించాలన్న పట్టుదలతోనే మైదానంలోకి దిగుతాం. జట్టుగా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తాం. ఎక్కడా రాజీపడలేదు. నిబద్దతతోనే ఆడుతున్నాం. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదన్న కారణం వల్ల నేను ఆర్సీబీని వీడాలని అనుకోవడం లేదు. ఆటలో గెలుపోటములు సహజం. నేను ఇక్కడ ఉన్నంత సౌకర్యంగా మరెక్కడా ఉండలేనని చెప్పగలను. ఏ స్టేడియంలో మ్యాచ్ జరిగినా మా జట్టుకు ఫ్యాన్ బేస్ అమోఘం. పెద్ద ఎత్తున అభిమానుల నుంచి మాకు మద్దతు లభిస్తుంది. ఆర్సీబీతో నా అనుబంధం అద్భుతం” అని కోహ్లీ పేర్కొన్నాడు.
కాగా, 2013 నుంచి ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ.. ఈసారి ఎలాగైనా ఐపీఎల్ ట్రోఫీని సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇక ఈ ఏడాది వేలంలో కొనుగోలు చేసిన మ్యాక్స్‌వెల్, కైలీ జామీసన్‌లు ఆ జట్టుకు మరింత బలాన్ని చేకూర్చారు.
Also Read:
Viral: గుడిలో చోరీకి యత్నించాడు.. దేవుడు పనిష్మంట్ ఇచ్చాడు.. ఆ శిక్ష ఏంటంటే.
ఆ గ్రామంలో నివసించాలనుకునే వారికి ఇల్లు, కారు ఫ్రీ.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.!
Viral News: 10 ఏళ్లు.. రూ. 221 కోట్లు.. ఈ బుద్దోడు ఇంతలా ఎలా సంపాదించాడంటే.!