IPL 2021: అభిమానులకు గుడ్ న్యూస్.. స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి.. షరతులు వర్తిస్తాయి..
IPL 2021: ఐపీఎల్ అభిమానులకు బిసిసిఐ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా మధ్యలోనే వాయిదా పడిన ఐపీఎల్ సీజన్ 14 మ్యాచ్‌లు.. యూఏఈ....
IPL 2021: ఐపీఎల్ అభిమానులకు బిసిసిఐ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా మధ్యలోనే వాయిదా పడిన ఐపీఎల్ సీజన్ 14 మ్యాచ్‌లు.. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ మధ్యలో నిర్వహిస్తున్నారు. అయితే, గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని తొలుత భావించినా.. ఆ తరువాత ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) మనసు మార్చుకుంది. ఈ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించాలని డిసైడ్ అయ్యింది. అయితే కొన్ని షరతులు విధించింది ఈసీబీ. ప్రతీ మ్యాచ్‌కు 50 శాతం మంది ప్రేక్షకులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఈ 50 శాతం ప్రేక్షకులను కూడా టీకాలు వేసుకున్న వారినే అనుమతించే అవకాశం ఉందని ఈసీబీ అధికారులు పేర్కొన్నారు.
కాగా, ఐపీఎల్ సెకండాఫ్ మ్యాచ్‌ల నిర్వహణ, స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించడంపై బీసీసీఐ అధికారులు త్వరలోనే ఈసీబీ అధికారులతో సంప్రదింపులు జరుపనున్నారు. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో ఐపీఎల్ సీజన్ 13 మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో యూఏఈలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో ప్రేక్షకులు లేకుండానే టోర్నమెంట్‌ను ముగించేశారు. ప్రస్తుతం అక్కడ కరోనా వైరస్ వ్యాప్తి అదుపులో ఉన్న నేపథ్యంలో ప్రేక్షకుల అనుమతికి ఈసీబీ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also read:
Good News: జూన్‌లో జోరందుకోనున్న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ.. కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన