IPL 2021 Auction: రూ. 16.25 కోట్లకు మోరిస్‌ను దక్కించుకున్న రాయల్స్.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రియం..

IPL 2021 Auction: చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ కొనసాగుతోంది. అనూహ్యంగా దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను అత్యధిక ధర రూ. 16.25 కోట్లకు రాజస్థాన్ రాయల్స్  దక్కించుకుంది...

IPL 2021 Auction:  రూ. 16.25 కోట్లకు మోరిస్‌ను దక్కించుకున్న రాయల్స్.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రియం..
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 18, 2021 | 4:29 PM

Chris Morris IPL Auction 2021: చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ కొనసాగుతోంది. అనూహ్యంగా దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను అత్యధిక ధర రూ. 16.25 కోట్లకు రాజస్థాన్ రాయల్స్  దక్కించుకుంది. గత సీజన్లతో పోలిస్తే ఐపీఎల్ చరిత్రలో ఇదే భారీ మొత్తం కావడం గమనార్హం. క్రిస్ మోరిస్ గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఫామ్ లేమితో సతమతమవుతుండటంతో అతడిని ఆర్సీబీ రిలీజ్ చేసింది. బేస్ ప్రైస్ రూ. 75 లక్షల నుంచి రూ. 16.25 కోట్ల వరకు పలికిన మోరిస్‌ను చివరికి రాజస్థాన్ రాయల్స్  దక్కించుకుంది. అటు మ్యాక్స్‌వెల్‌ను రూ. 16,25 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ దక్కించుకుంది. యువరాజ్ సింగ్ తర్వాత రూ. 16 కోట్లు దాటిన రెండో ఆటగాడు ఇతడే.

ఇక స్టీవ్ స్మిత్‌ను రూ. 2.20 కోట్లకు ఢిల్లీ,  షకిబుల్ హాసన్‌ను రూ. 3.20 కోట్లకు కోల్‌కతా, మొయిన్ అలీని రూ. 7 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్, శివమ్ దూబేను రూ. 4.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకున్నాయి. కాగా, ఈ మినీ ఆక్షన్‌లో ఇప్పటిదాకా పలువురు స్టార్ ప్లేయర్స్ అమ్ముడుపోలేదు. ఆరోన్ ఫించ్, కేదార్ జాదవ్, లెవీస్, జాసన్ రాయ్, హనుమ విహారి, హాల్స్, కరుణ్ నాయర్ ఉన్నారు.

chris-morris