AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021 Auction: వేలం పాటలో మ్యాక్స్‌వెల్ కోసం భారీ పోటీ.. దక్కించుకున్న రాయల్ ఛాలెంజర్స్.. ఎంత ధర పలికాడంటే!

IPL 2021 Auction: ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ శరవేగంగా సాగుతోంది. చెన్నై వేదికగా సాగుతున్న ఈ వేలం పాటలో తొలి ప్లేయర్స్‌‌ను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. అనుకున్నట్లుగానే ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్...

IPL 2021 Auction: వేలం పాటలో మ్యాక్స్‌వెల్ కోసం భారీ పోటీ.. దక్కించుకున్న రాయల్ ఛాలెంజర్స్.. ఎంత ధర పలికాడంటే!
మ్యాక్స్ వెల్
Ravi Kiran
|

Updated on: Feb 18, 2021 | 6:41 PM

Share

IPL 2021 Auction: ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ శరవేగంగా సాగుతోంది. చెన్నై వేదికగా సాగుతున్న ఈ వేలం పాటలో తొలి ప్లేయర్స్‌‌ను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. అనుకున్నట్లుగానే ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అత్యధిక ధర పలికాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం రూ. 14.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.  రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ అయిన మ్యాక్సీ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. రాయల్ ఛాలెంజర్స్, చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వేలంలో పోటీపడ్డాయి. చివరికి ఆర్సీబీ సొంతం చేసుకుంది. అటు మరో ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ రూ. 2.20 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అటు ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఫస్ట్ సెట్‌లో అమ్ముడుపోకపోవడం గమనార్హం.

కాగా, ఈ ఏడాది జరుగుతోన్న మినీ వేలం పాటలో 164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రూ.2 కోట్ల కనీస ధర జాబితాలో కేవలం ఇద్దరే ఇద్దరు దేశీ ఆటగాళ్లకు చోటు లభించగా.. ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. అన్ని జట్లలో కలిసి 61 స్థానాలు ఖాళీగా ఉండగా.. అత్యధికంగా బెంగళూరు జట్టులో 13, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

Follow Us
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
విష్ణు విన్యాసం మూవీ రివ్యూ.. శ్రీ విష్ణ మరోసారి నవ్వించాడా లేదా.
విష్ణు విన్యాసం మూవీ రివ్యూ.. శ్రీ విష్ణ మరోసారి నవ్వించాడా లేదా.
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
మీరు బుక్ చేసుకున్న సీట్లో వేరేవాళ్లు కూర్చున్నారా?.. ఇలా చేయండి
మీరు బుక్ చేసుకున్న సీట్లో వేరేవాళ్లు కూర్చున్నారా?.. ఇలా చేయండి
ఏపీలో వీరికి ప్రతీ నెలా రూ.1,750.. దరఖాస్తు చేసుకోండి
ఏపీలో వీరికి ప్రతీ నెలా రూ.1,750.. దరఖాస్తు చేసుకోండి
ఎటు పోతుందిరా సమాజం.. చికెన్ కోసం సొంత తమ్ముడినే దారుణంగా..
ఎటు పోతుందిరా సమాజం.. చికెన్ కోసం సొంత తమ్ముడినే దారుణంగా..
అప్పుడే పుట్టిన ఈ బుడ్డోడి బరవు తెలిస్తే మైండ్ బ్లాక్..!
అప్పుడే పుట్టిన ఈ బుడ్డోడి బరవు తెలిస్తే మైండ్ బ్లాక్..!
ఇలా చేస్తే ఉదయం వేళల్లో 2 నిమిషాల్లోనే బ్రేక్‌ ఫాస్ట్‌ రెడీ..
ఇలా చేస్తే ఉదయం వేళల్లో 2 నిమిషాల్లోనే బ్రేక్‌ ఫాస్ట్‌ రెడీ..
IPLలో సెన్సేషన్.. హీరోయిన్ జూహీ చావ్లా కూతురిని చూశారా.. ?
IPLలో సెన్సేషన్.. హీరోయిన్ జూహీ చావ్లా కూతురిని చూశారా.. ?