AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : స్వర్గం భూమి మీదకు వస్తే ఇలాగే ఉంటుందేమో.. రోహిత్ శర్మ ఇంటి లగ్జరీ చూస్తే కళ్లు చెదరాల్సిందే

Rohit Sharma : ముంబైలోని వర్లీలో ఉన్న రోహిత్ శర్మ రూ. 30 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్ విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అరబిక్ సముద్రపు అందాలు, ప్రైవేట్ లైబ్రరీ, విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన హిట్‌మ్యాన్ ఇల్లు భూలోక స్వర్గాన్ని తలపిస్తుంది.

Rohit Sharma : స్వర్గం భూమి మీదకు వస్తే ఇలాగే ఉంటుందేమో.. రోహిత్ శర్మ ఇంటి లగ్జరీ చూస్తే కళ్లు చెదరాల్సిందే
Inside Rohit Sharmas Rs 30 Crore Sea Facing Mumbai Apartment
Rakesh
|

Updated on: Apr 24, 2026 | 11:44 AM

Share

Rohit Sharma : టీమిండియా స్టార్ ప్లేయర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, వ్యక్తిగత జీవితంలో అంత ప్రశాంతంగా ఉంటాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన ఈ స్టార్ క్రికెటర్, ముంబైలో ఒక అద్భుతమైన విలాసవంతమైన భవనంలో నివసిస్తున్నాడు. సముద్రపు అంచున, ఆకాశాన్ని తాకేలా ఉండే ఈ ఇంటి విశేషాలు ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.

రోహిత్ శర్మ తన భార్య రితిక, కుమార్తె సమైరాతో కలిసి సౌత్ ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతం వర్లీలో నివసిస్తున్నారు. ఇక్కడ ఉన్న అహుజా టవర్స్ అనే ప్రీమియం రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో 29వ అంతస్తులో రోహిత్ అపార్ట్‌మెంట్ ఉంది. సుమారు 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటి నుంచి అరబిక్ సముద్రం దాదాపు 270 డిగ్రీల కోణంలో కనిపిస్తుంది. ఈ ఇంటి ప్రస్తుత విలువ దాదాపు రూ.30 కోట్లుగా అంచనా.

రోహిత్ శర్మ ఇంటి లోపలి భాగాన్ని చాలా క్లాసీగా డిజైన్ చేశారు. ముఖ్యంగా లివింగ్ రూమ్ 13 అడుగుల ఎత్తు ఉన్న సీలింగ్‌తో చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఈ ఇంట్లో నాలుగు బెడ్‌రూమ్‌లు, ఒక విశాలమైన కిచెన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఏరియా ఉన్నాయి. రోహిత్ దంపతులు ఇంటి కోసం తెలుపు, లైట్ కలర్స్ ఎంచుకున్నారు. అందమైన పెయింటింగ్స్, మోడ్రన్ చెక్క ఫర్నీచర్ ఈ ఇంటికి మరింత అందాన్ని ఇస్తాయి.

చదువుకోవడానికి ఇష్టపడే రోహిత్ కోసం ప్రత్యేకంగా ఒక స్టడీ రూమ్ లేదా లైబ్రరీని ఏర్పాటు చేశారు. దీనితో పాటు, క్రికెట్ వ్యవహారాలు లేదా ఇతర బిజినెస్ పనుల కోసం ఒక ప్రత్యేక వర్క్ స్పేస్ కూడా ఉంది. అలాగే రితిక కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాక్-ఇన్ క్లోసెట్ ఈ ఇంటి ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఇక్కడ డ్రస్సులు, యాక్సెసరీస్ కోసం భారీ స్టోరేజ్ అందుబాటులో ఉంది.

రోహిత్ శర్మ ఇంటికి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ దాని బాల్కనీ. గాజు తలుపులతో ఉండే ఈ బాల్కనీ నుంచి సముద్రపు గాలులు నేరుగా లోపలికి వస్తాయి. సాయంత్రం వేళల్లో కుటుంబంతో కలిసి సేదతీరడానికి ఇక్కడ అవుట్‌డోర్ సీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న మొక్కలు, టెక్చర్డ్ వాల్స్ ఒక రిసార్ట్ లాంటి అనుభూతిని ఇస్తాయి.

View this post on Instagram

A post shared by Ritika Sajdeh (@ritssajdeh)

రోహిత్ శర్మ నివసిస్తున్న ఈ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో కేవలం సెలబ్రిటీలకు మాత్రమే సాధ్యమయ్యే సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో ఒక మినీ థియేటర్, స్పా సేవలు, స్విమ్మింగ్ పూల్, స్కై కేఫ్, సిగార్ లాంజ్, మనం కోరుకున్నప్పుడు వచ్చే చెఫ్-ఆన్-డిమాండ్ సర్వీస్ వంటి ఎన్నో లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. మొత్తం మీద రోహిత్ శర్మ ఇల్లు ఒక ఆధునిక సౌకర్యాల నిలయం అని చెప్పొచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us