INDW vs SLW 1st T20: టీమిండియాదే తొలి టీ20.. శ్రీలంకపై 34 పరుగుల తేడాతో విజయం.. రాణించిన బౌలర్లు..

IND-W vs SL-W T20 Series: భారత మహిళల క్రికెట్ జట్టు 3 మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లింది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

INDW vs SLW 1st T20: టీమిండియాదే తొలి టీ20.. శ్రీలంకపై 34 పరుగుల తేడాతో విజయం.. రాణించిన బౌలర్లు..
Indw Vs Slw 1st T20
Follow us
Venkata Chari

|

Updated on: Jun 23, 2022 | 6:47 PM

దంబుల్లాలో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించింది. ఇక్కడ భారత జట్టు 34 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయినా.. మ్యాచ్‌ను కాపాడుకుంది. అద్భుతంగా రాణిస్తున్న శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లకు భారత బౌలర్లు అడ్డుకట్ట వేశారు. శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత క్రీడాకారిణి జెమీమా రోడ్రిగ్స్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచింది.

జెమీమా సూపర్ ఇన్నింగ్స్..

ఇవి కూడా చదవండి

భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభం పేలవంగానే సాగింది. భారత్ 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. స్మృతి మంధాన (1), సబ్బినైని మేఘన (0) చౌకగా పెవిలియన్‌కు చేరుకున్నారు. అనంతరం ఓపెనర్ షఫాలీ వర్మ (31)కు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22) చక్కటి సహకారం అందించి జట్టు స్కోరును 50 దాటేలా చేశారు. దీని తర్వాత, జెమీమా రోడ్రిగ్జ్ 27 బంతుల్లో 36 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడుతూ భారత జట్టును నూట ముప్పై దాటించింది. దీంతో భారత జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.

కట్టుదిట్టమైన బౌలింగ్..

139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక టీంను భారత బౌలర్లు అడ్డుకున్నారు. ఆరంభం నుంచి శ్రీలంక జట్టును ఒత్తిడిలో ఉంచి నిర్ణీత విరామాల్లో వికెట్లు పడగొట్టారు. 54 పరుగులకే శ్రీలంక జట్టు 4 వికెట్లు కోల్పోయింది. కవిషా దిల్హరి 47 పరుగులతో అజేయంగా రాణించడంతో లంక జట్టు 100 పరుగుల మార్కును దాటింది. నిర్ణీత ఓవర్లకు శ్రీలంక జట్టు 5 వికెట్ల నష్టానికి 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత జట్టులో రాధా యాదవ్ 2, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, షఫాలీ వర్మ తలో వికెట్ పడగొట్టారు.

ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ
సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు!
సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు!
టీమిండియా విజయానికి 7 వికెట్లు.. ఆసీస్‌కు 91 పరుగులు..
టీమిండియా విజయానికి 7 వికెట్లు.. ఆసీస్‌కు 91 పరుగులు..