INDW vs AUSW: 100 వికెట్లు, 1000 పరుగులు.. తొలి మహిళా క్రికెటర్‌గా దీప్తిశర్మ సరికొత్త రికార్డ్..

INDW vs AUSW: 131 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు మరో ఓవర్‌ మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆల్ రౌండర్ దీప్తి శర్మ జట్టు తరపున అత్యధికంగా 30 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ కూడా టీమిండియా తరపున 2 వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది.

INDW vs AUSW: 100 వికెట్లు, 1000 పరుగులు.. తొలి మహిళా క్రికెటర్‌గా దీప్తిశర్మ సరికొత్త రికార్డ్..
Indw Vs Ausw Deepti Sharma
Follow us
Venkata Chari

|

Updated on: Jan 08, 2024 | 8:30 PM

INDW vs AUSW, Deepti Sharma: నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత్ మహిళల జట్టు, ఆస్ట్రేలియా మహిళల జట్టు మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆసీస్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆల్ రౌండర్ దీప్తి శర్మ జట్టు తరపున అత్యధికంగా 30 పరుగులు చేసింది.

131 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు మరో ఓవర్‌ మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ కూడా టీమిండియా తరపున 2 వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది.

ఆసీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో దీప్తి శర్మ 30 పరుగుల ఇన్నింగ్స్ ఆడి టీ20లో 1000 పరుగులు పూర్తి చేసింది. అలాగే, టీమ్ ఇండియా తరపున 100 వికెట్లు, 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా దీప్తి రికార్డు సృష్టించింది. భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ మహిళల టీ20లో 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 27 బంతుల్లో 30 పరుగులు చేసి టీ20లో వెయ్యి పరుగులు పూర్తి చేసింది. అంతకుముందు, 2023 మహిళల టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 100 T20I వికెట్లు తీసిన మొదటి భారతీయ మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది.

రెండో టీ20 మ్యాచ్‌కు ముందు దీప్తి 1000 పరుగుల మార్క్‌ను దాటేందుకు 29 పరుగులు చేయాల్సి ఉంది. దీప్తి 102 మ్యాచ్‌ల్లో 72 ఇన్నింగ్స్‌ల్లో 971 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాపై 29వ పరుగు పూర్తి చేసిన వెంటనే దీప్తి 1000 పరుగులు పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో దీప్తి 27 బంతుల్లో 5 బౌండరీల సాయంతో 30 పరుగులు చేసింది. ఆ తర్వాత 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది.

INDW vs AUSW, 2వ టీ20ఐ:

భారత మహిళల జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, పూజా వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, రేణుకా ఠాకూర్ సింగ్, టిటాస్ సాధు, మన్నత్ కశ్యక్, సనాత్ కశ్యప్ కనికా అహుజా, యాస్తికా భాటియా, మిన్ను మణి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?