AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: 7 సిక్సులు, 15 ఫోర్లతో ఊచకోత.. మరో సెంచరీతో భారత ఆటగాడి బీభత్సం.. రికార్డులకే దడ పుట్టించాడుగా..

One Day Cup 2023: డర్హామ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు 43.2 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. నార్తాంప్టన్‌షైర్‌కు చెందిన ఇంగ్లిష్ ఆల్‌రౌండర్ ల్యూక్ ప్రొక్టర్ 4 వికెట్లు తీశాడు. లక్ష్యాన్ని ఛేదించిన నార్తాంప్టన్‌షైర్ 25.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. 199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన నార్తాంప్టన్‌షైర్ షా ఇన్నింగ్స్‌తో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ టోర్నీలో షా టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Video: 7 సిక్సులు, 15 ఫోర్లతో ఊచకోత.. మరో సెంచరీతో భారత ఆటగాడి బీభత్సం.. రికార్డులకే దడ పుట్టించాడుగా..
Prithvi Shah
Venkata Chari
|

Updated on: Aug 14, 2023 | 6:36 AM

Share

Prithvi Shaw Century: ఆదివారం చెస్టర్-లీ-స్ట్రీట్‌లో డర్హామ్‌తో జరిగిన వన్డే కప్ 2023 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. షా వరుసగా రెండో గేమ్‌లో ఈ సెంచరీ సాధించాడు. అంతకుముందు సోమర్‌సెట్‌పై పృథ్వీ షా 244 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు.

నార్తాంప్టన్‌షైర్ ఈ యంగ్ ఓపెనర్ 68 బంతుల్లో సెంచరీని సాధించాడు. వరుసగా మూడు బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో మ్యాచ్‌ను అద్భుతంగా ముగించాడు. షా 76 బంతుల్లో 125 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

199 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన నార్తాంప్టన్‌షైర్ షా ఇన్నింగ్స్‌తో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ టోర్నీలో షా టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఈ ఇన్నింగ్స్ సమయంలో షా 76 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో 125 నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 15 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. అతను 21వ ఓవర్‌లో లెగ్ స్పిన్నర్ స్కాట్ బోర్త్‌విక్ వరుస బంతుల్లో రెండు సిక్స్‌లు, మూడు ఫోర్ల సహాయంతో 24 పరుగులు చేశాడు. దీంతో మ్యాచ్‌లో జోరు నార్తాంప్టన్‌షైర్ వైపు మళ్లింది.

199 పరుగుల లక్ష్యాన్ని అందించిన డర్హామ్..

డర్హామ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు 43.2 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. నార్తాంప్టన్‌షైర్‌కు చెందిన ఇంగ్లిష్ ఆల్‌రౌండర్ ల్యూక్ ప్రొక్టర్ 4 వికెట్లు తీశాడు. లక్ష్యాన్ని ఛేదించిన నార్తాంప్టన్‌షైర్ 25.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది.

సోమర్‌సెట్‌పై 244 పరుగుల ఇన్నింగ్స్..

23 ఏళ్ల షా బుధవారం సోమర్‌సెట్‌పై 153 బంతుల్లో 244 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 28 ఫోర్లు, 11 సిక్సర్లు కొట్టాడు. దీంతో 50 ఓవర్ల మ్యాచ్‌లో అంటే లిస్ట్ ఏ మ్యాచ్‌లో టాప్ స్కోర్ చేసిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా షా నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై 277 పరుగులు చేసిన తమిళనాడుకు చెందిన నారాయణ్ జగదీషన్ ఈ జాబితాలో మొదటి పేరుగా నిలిచింది.

టోర్నమెంట్‌లో టాప్ స్కోరర్‌గా షా..

కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ షా ప్రస్తుతం 2023 వన్డే కప్‌లో నాలుగు మ్యాచ్‌లలో 143 సగటుతో 429 పరుగులతో టోర్నమెంట్‌లో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అదే సమయంలో 5 ఇన్నింగ్స్‌లలో 329 పరుగులు చేసిన భారత ఆటగాడు చెతేశ్వర్ పుజారా ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు.

షాకు 2021 నుంచి టీమ్ ఇండియాలో నో ఛాన్స్..

2018లో తన కెప్టెన్సీలో భారత్‌కు అండర్-19 ప్రపంచకప్‌ను అందించిన పృథ్వీ షా.. 2018లోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను తన అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించాడు. కానీ, అంతర్జాతీయ స్థాయిలో అతని టెక్నిక్ బౌలర్ల ముందు బలహీనంగా కనిపించింది. అతను జులై 2021లో శ్రీలంకతో జరిగిన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను ODIగా ఆడాడు. అప్పటి నుంచి అతను భారతదేశం తరపున ఏ మ్యాచ్ ఆడలేకపోయాడు.

ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు షా జట్టులో చేరాడు. అయితే శుభ్‌మన్ గిల్, రితురాజ్ గైక్వాడ్ సమక్షంలో ప్లేయింగ్-11లో అతనికి చోటు దక్కలేదు.

డబుల్ సెంచరీ ఇన్నింగ్స్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..