Covishield: భారత క్రికెటర్లకు వ్యాక్సినేషన్.. ‘కోవిషీల్డ్’ మాత్రమే తీసుకోవాలని నిబంధన.. ఎందుకంటే.!

Indian Cricketers Vaccination: కరోనాపై పోరాటంలో భాగంగా టీకా ఒక కవచంలా పని చేస్తోంది. అందుకే కేంద్రం అందరూ...

Covishield: భారత క్రికెటర్లకు వ్యాక్సినేషన్.. 'కోవిషీల్డ్' మాత్రమే తీసుకోవాలని నిబంధన.. ఎందుకంటే.!
Only Covishield Dose For Indian Cricketer England Tour
Follow us

|

Updated on: May 08, 2021 | 7:20 PM

Indian Cricketers Vaccination: కరోనాపై పోరాటంలో భాగంగా టీకా ఒక కవచంలా పని చేస్తోంది. అందుకే కేంద్రం అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించింది. 18 సంవత్సరాలు పైబడిన వారికి ఉచిత వ్యాక్సిన్లు అందించాలని నిర్ణయించింది. ఈ రూల్ టీమిండియా క్రికెటర్లకు కూడా వర్తిస్తుంది. ఇక త్వరలోనే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత క్రికెటర్లు కేవలం ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్ మాత్రమే తీసుకోవాలని సూచించినట్లు ఓ నివేదిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కరోనా కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీనితో క్రికెటర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక జూన్ లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడేందుకు టీమిండియా ప్లేయర్స్ ఇంగ్లాండ్ పయనమవుతారు. ఆ తర్వాత టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఈ పర్యటనకు ముందుగా క్రికెటర్లకు వ్యాక్సిన్ వేయించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

అందులో భాగంగా భారత జట్టు ఆటగాళ్ళు కోవిషీల్డ్ మాత్రమే తీసుకోవాలని బీసీసీఐ సూచించినట్లు ఒక నివేదిక తెలిపింది. వారు కోవిషీల్డ్ మొదటి మోతాదును భారతదేశంలో తీసుకుంటే, ఇంగ్లాండ్‌లో రెండవ డోస్ తీసుకునేందుకు తీసుకోవచ్చు. ఆక్స్ ఫర్డ్ -ఆస్ట్రాజెనెకా కలిసి సంయుక్తంగా కోవిషీల్డ్ టీకాను ఉత్పత్తి చేస్తున్నాయని కాబట్టి, భారత ఆటగాళ్ళు ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు కోవిషీల్డ్ రెండవ మోతాదు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే బీసీసీఐ ఈ నిబంధనను పెట్టింది.

ఇవీ చదవండి:

Viral Video: అరటితోటను నాశనం చేసిన గజరాజులు.. ఆ ఒక్క చెట్టు తప్ప.. ఎందుకంటే.!

Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!

Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!