Team India: అక్టోబర్ నెలంటే భయపడుతోన్న భారత జట్టు.. 34 ఏళ్ల తర్వాత ఇలా..
Team India, IND vs ENG: ఈ ఏడాది మార్చిలో రోహిత్ శర్మ నాయకత్వంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న టీం ఇండియా, ఇప్పుడు శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో తొలి వన్డే ఆడింది. భారత జట్టు ఇప్పటికే వరుసగా ఎనిమిది వన్డేలు గెలిచింది. కానీ..

Team India: రోహిత్ శర్మ కెప్టెన్సీలో, టీమిండియా ఈ సంవత్సరం ఒక్క వన్డే కూడా ఓడిపోలేదు. అయితే, శుభ్‌మన్ గిల్ కొత్త కెప్టెన్ అయిన వెంటనే, భారత జట్టు తన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోయింది. గిల్ కెప్టెన్సీలో, అక్టోబర్ 19న ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పుడు అక్టోబర్ నెలలో టీమిండియా బలహీపత మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో చెత్త రికార్డు నమోదైంది. ఈ నెలలో వన్డే క్రికెట్ చరిత్రలో భారత జట్టు తన తొలి ఓటమిని చవిచూసి, తన విజయ పరంపరకు ముగింపు పలికింది.
34 ఏళ్ల తర్వాత టీమిండియాకు ఇలా..
ఈ ఏడాది మార్చిలో రోహిత్ శర్మ నాయకత్వంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న టీం ఇండియా, ఇప్పుడు శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో తొలి వన్డే ఆడింది. భారత జట్టు ఇప్పటికే వరుసగా ఎనిమిది వన్డేలు గెలిచింది. కానీ, ఆస్ట్రేలియా జట్టు తన విజయ పరంపరను నిలిపివేసింది. ఫలితంగా, 1991 తర్వాత తొలిసారిగా అక్టోబర్‌లో టీం ఇండియా మళ్లీ ఓడిపోయింది. అక్టోబర్‌లో వరుసగా ఐదవ ఓటమిని నమోదు చేసింది.
అక్టోబర్‌లో టీం ఇండియా ఎప్పుడు ఓడిపోయింది?
1978 అక్టోబర్ 13న టీం ఇండియా ఒక క్యాలెండర్ సంవత్సరంలో తొలి వన్డే ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత 1991లో అక్టోబర్ 23న టీం ఇండియా తొలి వన్డే ఓటమిని చవిచూసింది. అక్టోబర్‌లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో టీం ఇండియా తొలి వన్డే ఓటమిని చవిచూడటం ఇది మూడోసారి.
ఆస్ట్రేలియా చేతిలో టీం ఇండియా ఎలా ఓడిపోయింది?
ఆరు నెలలకుపైగా విశ్రాంతి తీసుకుని అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పెర్త్‌లో ఆకట్టుకోలేకపోయారు. టీమిండియా 26 ఓవర్లలో 136 పరుగులు మాత్రమే చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ అజేయంగా 46 పరుగులు చేసి జట్టును ఏడు వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిపించాడు. ఈ సిరీస్‌లో రెండవ వన్డే అక్టోబర్ 23న జరుగుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








