IND Vs WI T20: చివరి 2 T20లపై నెలకొన్న సందిగ్ధం.. రద్దయ్యేనా.. అసలు కారణం ఏంటంటే?

భారత్, వెస్టిండీస్ మధ్య చివరి రెండు టీ20 మ్యాచ్‌లు అమెరికాలో జరగనున్నాయి. అమెరికా వెళ్లేందుకు రెండు జట్ల ఆటగాళ్లకు ఇంకా వీసాలు రాకపోవడంతో అంతా సందిగ్ధంలో పడ్డారు.

IND Vs WI T20: చివరి 2 T20లపై నెలకొన్న సందిగ్ధం.. రద్దయ్యేనా.. అసలు కారణం ఏంటంటే?
Wi Vs Ind
Follow us

|

Updated on: Aug 03, 2022 | 5:14 PM

IND Vs WI T20: భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కొనసాగుతుండగా, మూడు మ్యాచ్‌ల తర్వాత టీమిండియా 2-1తో ముందంజలో ఉంది. ఈ సిరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌లు అమెరికాలో జరగాల్సి ఉంది. అయితే, ఈ రెండు మ్యాచ్‌లపై సందగ్ధం నెలకొంది. ఎందుకంటే ఇప్పటి వరకు టీమిండియా ఆటగాళ్లతోపాటు వెస్టిండీస్ ప్లేయర్లకు వీసా లభించలేదు. Cricbuzz నివేదిక ప్రకారం, వీసా సంబంధిత సమస్య కోసం భారత్, వెస్టిండీస్ జట్లు గయానాకు వెళ్లనున్నాయి. ఇక్కడ అమెరికన్ రాయబార కార్యాలయం ఉంది. వీసా కోసం ఆటగాళ్లందరూ అక్కడకు తప్పక వెళ్లాల్సి ఉంది. నాల్గవ టీ20 ఆగస్టు 6న జరగనుంది. కాబట్టి అప్పటికి ఈ సమస్య పరిష్కారమవుతుందని క్రికెట్ వెస్టిండీస్ భావిస్తోంది. ఎందుకంటే వీసాలు రాకపోతే ఈ రెండు మ్యాచ్‌లు వాయిదా లేదా రద్దు అయ్యే పరిస్థితి ఉంది.

అమెరికాలో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకే ఈ రెండు మ్యాచ్‌లను అక్కడ నిర్వహిస్తున్నారు. టీమిండియాకు ఎంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ మ్యాచ్‌లను అక్కడ నిర్వహిస్తే, అభిమానులకు స్టేడియాలకు రప్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు వీసా సమసయలతో అడ్డంకులు ఏర్పడే అవకాశం రావడంతో.. ప్రస్తుతం అంతా ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.

ఈ మొత్తం విషయంలో, గయానాలో బుధవారం ఆటగాళ్లందరి అపాయింట్‌మెంట్ బుక్ చేశారు. అన్ని పేపర్లు సిద్ధంగా ఉన్నాయని క్రికెట్ వెస్టిండీస్ తెలిపింది. వీసా లభిస్తుందని మాకు పూర్తి ఆశ ఉందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

సిరీస్‌లో చివరి రెండు టీ20 మ్యాచ్‌లు ఆగస్టు 6, 7 తేదీల్లో జరగనున్నాయి. టీమ్ ఇండియా వీసా పొందితేనే.. గయానా నుంచి మయామికి వెళ్లేందుకు అవకాశం ఉంది. ఇందుకు ఆటగాళ్లకు 5 గంటల సమయం పడుతుంది. ఈ సిరీస్‌లో ఏర్పాటుకు సంబంధించి చాలా సమస్యలు ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ల లగేజీ సెయింట్ కిట్స్‌కు చేరుకోకపోవడంతో రెండవ, మూడవ టీ20 మ్యాచ్‌లు చాలా ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.