IND vs SA: కరోనా వచ్చినా సిరీస్ రద్దు కాదు.. BCCI, CSA ఒప్పందం ఏం చెబుతోంది..

గత రెండేళ్లలో కరోనా వైరస్ కారణంగా చాలా క్రికెట్ సిరీస్‌లు రద్దయ్యాయి. కానీ ఇప్పుడు కరోనా వచ్చినా ఆగే పరిస్థితి లేదు...

IND vs SA: కరోనా వచ్చినా సిరీస్ రద్దు కాదు.. BCCI, CSA ఒప్పందం ఏం చెబుతోంది..
Ind Vs Sa
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 22, 2021 | 8:24 PM

గత రెండేళ్లలో కరోనా వైరస్ కారణంగా చాలా క్రికెట్ సిరీస్‌లు రద్దయ్యాయి. కానీ ఇప్పుడు కరోనా వచ్చినా ఆగే పరిస్థితి లేదు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఏ ఆటగాడికైనా కరోనా వచ్చినా, సిరీస్ కొనసాగుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా (CSA) మెడికల్ ఆఫీసర్ సుహైబ్ మంజ్రా తెలిపారు. ఆటగాళ్లు లేదా సహాయక సిబ్బందిలో ఎవరికైనా COVID-19 పాజిటివ్ వచ్చినా టెస్ట్, వన్డే సిరీస్‌లు కొనసాగించాలని BCCI (క్రికెట్ బోర్డ్ ఆఫ్ ఇండియా), CSA పరస్పరం అంగీకరించాయని సుహైబ్ మంజ్రా చెప్పారు.

“మేము భారత్‎తో చర్చించాము. ప్రతి ఒక్కరూ ‘బయో-బబుల్’ లోపల ఉండడంతోపాటు టీకాలు కూడా వేసుకున్నారు. ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే.. అతని పరిస్థితి నిలకడగా ఉంటే, అతను హోటల్ లోపల ఒంటరిగా ఉంటాడు.” అని సుహైబ్ మంజ్రా చెప్పారు. కరోనా వచ్చిన ఆటగాడితో కాంటక్ట్‎లో ఉన్న ఆటగాళ్లు ఆడటం, ప్రాక్టీస్ చేయడం కొనసాగిస్తారు. వారికి ప్రతిరోజూ పరీక్షలు చేస్తాం” అని అన్నారు. “ప్రతిరోజూ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేస్తాం. పాజిటివ్ కేసుల వస్తే పరిస్థితిని ఎదుర్కొనేందుకు రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయి. భారత జట్టుకు CSA అందించిన బయో బబుల్‌తో BCCI చాలా సంతృప్తి చెందింది.” అని వివరించారు.

డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. ఆ తర్వాత జనవరి 3 నుంచి 7 వరకు జోహన్నెస్‌బర్గ్‌లో రెండో టెస్టు, జనవరి 11 నుంచి 15 వరకు కేప్‌టౌన్‌లో మూడో టెస్టు జరగనుంది. టెస్ట్ సిరీస్ తర్వాత మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‎లో భారత్ పాల్గొననుంది. వన్డే మ్యాచ్‎లు జనవరి 19, 21, 23 తేదీల్లో జరుగుతాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బయో బబుల్‌లో ఉన్నారు. సాధారణ పరీక్షలు జరుగుతున్నాయని బీసీసీఐ సీనియర్ అధికారి చెప్పారు. దక్షిణాఫ్రికా క్రికెట్‌కు వాణిజ్య హక్కుల పరంగా భారత పర్యటన చాలా ముఖ్యమైంది.

Read Also… Virat Kohli: మారిపోయిన విరాట్ కోహ్లీ గొంతు.. వింటే ఆశ్చర్య పోతారు.. వైరల్‎గా మారిన వీడియో..