AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: జనవరి 19 నుంచి భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ మొదలు.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?

IND vs SA ODI Series: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జనవరి 19 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో ఇరు జట్లు గెలవాలని కోరుకుంటాయనడంలో సందేహం లేదు.

IND vs SA: జనవరి 19 నుంచి భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ మొదలు.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
India Vs South Africa
Venkata Chari
|

Updated on: Jan 17, 2022 | 5:38 PM

Share

IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటన భారత్‌కు ఎప్పుడూ సవాలుగా ఉంటుంది. ఇక్కడ భారత్‌కు విజయం అంతంత మాత్రమే. ఈసారి టెస్ట్‌లో దక్షిణాఫ్రికాను ఓడించే స్థితిలో భారత్ కనిపించింది. కానీ, ఆతిథ్య జట్టు కీలక సమయంలో పాచికలను తిప్పడంతో భారత్ విజయం సాధిచలేక పోయింది. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన మునుపటి పర్యటనలో భారత్ ఆతిథ్య జట్టును ఓడించింది. దక్షిణాఫ్రికా టూర్‌లో గత నాలుగు వన్డేల సిరీస్‌లో భారత్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

2010-11లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత్ దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఈ పర్యటనలో దక్షిణాఫ్రికాకు భారత్ గట్టి సవాల్ విసిరింది. తొలి మ్యాచ్‌లో భారత్‌ ఓడినా.. జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం ఆతిథ్య జట్టును భారత్‌ ఓడించింది. మూడో వన్డేలో యూసుఫ్ పఠాన్ అద్భుతమైన ఆటతో భారత్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించి దక్షిణాఫ్రికా సిరీస్‌ను సమం చేసింది. చివరి, నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ ఓడిపోయి 2-3తో సిరీస్‌ను కోల్పోయింది.

2013-14లో భారత్ మరోసారి దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఈసారి భారత జట్టు విశ్రాంతి లేని క్రికెట్ ఆడి దక్షిణాఫ్రికా చేరుకుంది. భారత బౌలర్లపై విధ్వంసం సృష్టించిన క్వింటన్ డి కాక్ ఈ సిరీస్‌ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ డి కాక్ సెంచరీ సాధించాడు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన తొలి వన్డేలో డికాక్ 135 పరుగులు చేసి భారత్ ఓటమికి కారణమయ్యాడు. డర్బన్‌లో, అతను 106 పరుగుల ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు తిరుగులేని 2-0 ఆధిక్యాన్ని అందించాడు. సెంచూరియన్‌లో జరిగిన మూడో వన్డేలో అతను మరో సెంచరీ సాధించాడు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ పూర్తి కాలేదు.

2017-18లో విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఈ పర్యటనలో, రెండు జట్ల మధ్య ఆరు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరిగింది. దీనిలో భారతదేశం 5-1తో గెలిచింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కోహ్లి సెంచరీతో భారత్ విజయం సాధించింది. ఇక్కడి నుంచి భారత్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే నాలుగో మ్యాచ్‌లో మాత్రం ఓటమి ఎదురైంది. కానీ, ఆ తర్వాత జట్టు పునరాగమనం చేసి మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Also Read: IND vs SA ODI Series: ఆటగాళ్లతో కెప్టెన్, కోచ్ మంతనాలు.. శ్రద్ధగా విన్న కోహ్లీ.. ‘వన్డే మోడ్ ఆన్‌’ అంటోన్న బీసీసీఐ

IPL 2022: గాయంతో కెప్టెన్సీ పోయింది.. తిరిగొచ్చినా సారథిగా ఛాన్స్ దక్కలే.. అద్భుత ఫాంతో కోట్లు కురిపించనున్న ప్లేయర్..!