IND vs SA: హిస్టరీ రిపీట్ చేసేందుకు దక్షిణాఫ్రికా.. చరిత్ర సృష్టించే పనిలో భారత్.. అసలు సెంచూరియన్ రికార్డులు ఎలా ఉన్నాయంటే?
రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు ఆలౌటయిన టీమిండియా దక్షిణాఫ్రికా ముందు 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే.
India vs South Africa 1st Test: సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు చివరి దశకు చేరుకుంది. ఈ మ్యాచులో ఫలితం తేలేలా కనిపిస్తోంది. కోహ్లీసేన విజయం సాధించాలంటే 6 వికెట్లు పడగొట్టాల్సి ఉంది. నిజానికి రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులు చేసిన టీమిండియా, దక్షిణాఫ్రికా ముందు 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దక్షిణాఫ్రికా జట్టు నాలుగు సెషన్ల కంటే ఎక్కువ బ్యాటింగ్ చేయనుంది. కాబట్టి ఈ టెస్ట్ ఫలితం దాదాపుగా ఖచ్చితంగా తేలనుందని తెలుస్తోంది. ఇంతకు ముందు సౌతాఫ్రికా జట్టు స్వదేశంలో 300 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఎన్నిసార్లు ఛేదించిందో ఓసారి తెలుసుకుందాం.
స్వదేశంలో దక్షిణాఫ్రికా ఒక్కసారి మాత్రమే 300 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించింది. దక్షిణాఫ్రికా జట్టు స్వదేశంలో నాల్గవ ఇన్నింగ్స్‌లో 300 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఒక్కసారి మాత్రమే ఛేదించగలిగింది. 2001-02లో డర్బన్ టెస్టులో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 335 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
సెంచూరియన్‌లో భారీ ఛేజ్ ఎంతంటే? సెంచూరియన్‌లో ఇప్పటివరకు 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేదు. ఈ మైదానంలో ఇంగ్లండ్ అత్యధిక పరుగుల వేటను చేసింది. 2000లో దక్షిణాఫ్రికాపై ఈ మైదానంలో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 251 పరుగులు చేసింది. అయితే, ఈ మైదానంలో మొత్తం 27 మ్యాచ్‌లు ఆడగా, అందులో 21 మ్యాచ్‌ల్లో ఆతిథ్య జట్టు గెలుపొందింది. అదే సమయంలో, విదేశీ జట్టు రెండుసార్లు మాత్రమే గెలిచింది.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టెస్ట్ ప్రస్తుత పరిస్థితి.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేసింది. టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ 123 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాట్స్‌మెన్స్ అద్భుతమైన ప్రదర్శన తర్వాత, బౌలర్లు కూడా అద్భుతాలు చేసి దక్షిణాఫ్రికాను మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 197 పరుగులకే కట్టడి చేశారు.
తొలి ఇన్నింగ్స్‌లో 130 పరుగుల ఆధిక్యం సాధించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో దక్షిణాఫ్రికా నాలుగో ఇన్నింగ్స్‌లో 305 పరుగుల లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది.