IND vs SA: చివరి రోజుకు చేరిన ఫలితం.. విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్.. విదేశాల్లో బుమ్రా స్పెషల్ రికార్డ్..!
5వ రోజు, విరాట్ సేన 6 వికెట్లు తీసి మ్యాచ్‌ని గెలవాలని చూస్తుంటే, మ్యాచ్‌ను డ్రా చేసుకోవడమే ఆతిథ్య జట్టు లక్ష్యంగా పోరాడనుంది. ఆఫ్రికా విజయానికి ఇంకా 211 పరుగుల దూరంలో నిలిచింది.
India vs South Africa: సెంచూరియన్ టెస్టులో నాలుగో రోజు మరోసారి టీమ్ ఇండియా సత్తా చాటింది. దక్షిణాఫ్రికా 305 పరుగుల లక్ష్యంతో పోరాడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్రికా జట్టు స్కోరు 4 వికెట్ల నష్టానికి 94 పరుగులుగా నిలిచింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 5వ రోజు, విరాట్ సేన 6 వికెట్లు తీసి మ్యాచ్‌ని గెలవాలని చూస్తుంటే, మ్యాచ్‌ను డ్రా చేసుకోవడమే ఆతిథ్య జట్టు లక్ష్యంగా పోరాడనుంది. ఆఫ్రికా విజయానికి ఇంకా 211 పరుగుల దూరంలో నిలిచింది.
ఆఫ్రికా జట్టు 34 పరుగుల వద్ద తొలి రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత బుమ్రా పునరాగమనం చేశాడు . దీని తర్వాత డీన్ ఎల్గర్, రైసీ వాన్ డెర్ డస్సెన్ నాలుగో వికెట్‌కు 135 బంతుల్లో 40 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యం టీమ్ ఇండియాకు ఇబ్బందులను సృష్టిస్తోంది, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో వాన్ డెర్ డుస్సెన్ (11 పరుగులు) ఈ భాగస్వామ్యాన్ని విడదీయడమే కాకుండా టీమ్ ఇండియాను మ్యాచ్‌లో వెనక్కి రప్పించాడు. ఈ వికెట్‌తో బుమ్రా విదేశీ గడ్డపై తన 100 టెస్టు వికెట్లు కూడా పూర్తి చేసుకున్నాడు. తన తర్వాతి ఓవర్‌లోనే బుమ్రా నైట్ వాచ్‌మెన్ కేశవ్ మహరాజ్ (8 పరుగులు)ను క్లీన్ బౌల్డ్ చేసి ఆఫ్రికాకు నాలుగో దెబ్బ రుచిచూపించాడు.
బుమ్రా విదేశీ గడ్డపై ఆడిన 22 టెస్టు మ్యాచ్‌ల్లో 101 వికెట్లు పడగొట్టాడు. అలాగే ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఇప్పటి వరకు 4 వికెట్లు పడగొట్టాడు. ఆతిథ్య జట్టుకు ఆరంభం పేలవంగా ఉండటంతో ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఐడెన్ మార్క్‌రమ్‌ను బౌల్డ్ అయ్యి వెనుదిరిగాడు. మార్క్రామ్ 7 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. టీమ్ ఇండియాకు రెండో వికెట్‌ను మహమ్మద్ సిరాజ్ అందించాడు. కీగన్ పీటర్సన్ (17 పరుగులు)ను పెవిలియన్ చేర్చాడు.
సెంచూరియన్‌లో విజయవంతమైన రన్ చేజ్ ఎంతంటే? సెంచూరియన్‌లో అత్యంత విజయవంతమైన రన్ చేజ్ ఇంగ్లండ్ పేరిట నమోదైంది. 2000 సంవత్సరంలో ఆఫ్రికా 249 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, దానిని 2 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ సాధించింది. ఆ తర్వాత 1998లో శ్రీలంకపై ఆఫ్రికా జట్టు 226 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 174 పరుగులకు ఆలౌట్.. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 174 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే సమయంలో ఫాస్ట్ బౌలర్లు కగిసో రబడా, మార్కో జెన్సన్ ఆఫ్రికా తరుపున చెరో వికెట్ పడగొట్టారు. 43వ ఓవర్‌లో ఆర్ అశ్విన్, కగిసో రబాడ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ క్వింటన్ డి కాక్‌కి క్యాచ్ ఇచ్చాడు. అశ్విన్ రివ్యూ తీసుకున్నాడు. రీప్లేలో బంతి బ్యాట్‌పై కాకుండా అశ్విన్ కుడి చేతిపై తాకి డి కాక్ చేతికి చిక్కినట్లు కనిపించింది. డీఆర్‌ఎస్ తీసుకోవడం అశ్విన్‌కు అనుకూలంగా మారింది. దీంతో అశ్విన్ నాటౌట్‌గా నిలిచాడు. 46వ ఓవర్లో రబాడ వేసిన బంతికి అశ్విన్ మరోసారి ఔటయ్యాడు. అశ్విన్ మరోసారి సమీక్ష కోరాడు. బంతి మొదట గ్లోవ్‌ను తాకినట్లు రీప్లేలు చూపించాయి. ఈసారి డీఆర్ఎస్ అశ్విన్‌ను రక్షించలేకపోయింది. అతను 14 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఆ తరువాత అజింక్యా రహానే 23 బంతుల్లో 20 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. గత 24 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో రహానే టెస్టు సెంచరీ చేయలేదు.
మళ్లీ నిరాశపరిచిన కోహ్లి-పుజారా.. తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులు చేసిన భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచాడు. నాల్గవ రోజు లంచ్ తర్వాత, మార్కో జెన్సన్ వేసిన మొదటి బంతికే వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్‌కి కోహ్లీ క్యాచ్ ఇచ్చాడు. కోహ్లి 32 బంతుల్లో 18 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ అవుట్‌గోయింగ్ బంతిని ఆడే ప్రయత్నంలో వికెట్ కోల్పోయిన విరాట్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తప్పును పునరావృతం చేశాడు.
విరాట్ కోహ్లి వికెట్ తర్వాత, ఛెతేశ్వర్ పుజారా కూడా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించలేకపోయాడు. రెండవ ఇన్నింగ్స్‌లో, 64 బంతుల్లో 16 పరుగులు చేసి, అతను లుంగీ ఎంగిడి చేతిలో అవుట్ అయ్యాడు.
కోహ్లీ గత 60 ఇన్నింగ్స్‌లు, 768 రోజులుగా అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సెంచరీ చేయలేదు. 2021లో విరాట్ 11 టెస్టు మ్యాచ్‌ల్లో 28.21 సగటుతో మొత్తం 536 పరుగులు చేశాడు. గత 43 ఇన్నింగ్స్‌ల్లో ఛెతేశ్వర్ పుజారా సెంచరీ చేయలేదు. లుంగీ ఎంగిడి రెండోసారి పుజారాను అవుట్ చేశాడు.
రెండు జట్లు- ఇండియా: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
సౌతాఫ్రికా: డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, కీగన్ పీటర్సన్, రైసీ వాన్ డెర్ డ్యూసెన్, టెంబా బౌమా, క్వింటన్ డి కాక్ (కీపర్), వియాన్ ముల్డర్, మార్కో జెన్సన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి.
Stumps on Day 4 of the 1st Test.
South Africa end the day on 94/4. #TeamIndia 6 wickets away from victory.
Scorecard – https://t.co/eoM8MqSQgO #SAvIND pic.twitter.com/IgRuammbPo
— BCCI (@BCCI) December 29, 2021
How many times have we seen bumrah running in and delievering wickets when India need it the most? Bumrah, bohot pyaar ❤️
Looks like art, doesn’t it?!
VC – @StarSportsIndia#Bumrah #INDvSA pic.twitter.com/C2CEtNDcEw
— Boxing day test ???? (@Sectumsempra187) December 29, 2021
Also Read: India Vs South Africa: పట్టుబిగించిన టీమిండియా.. సఫారీల టార్గెట్ 305