AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: 10వ సారి అదే తప్పు.. ఒకేలా ఔటవుతోన్న భారత సారథి.. సమస్యంతా అక్కడే ఉందంటోన్న మాజీలు..!

IND vs SA 1st Test: ఈ ఏడాది 10వ సారి ఇలా ఓవర్సీస్ పిచ్‌లపై పెవిలియన్ చేరాడు. కోహ్లీ ఎందుకు నిరంతరం ఇలా విఫలమవుతున్నాడు.. ఇదే విషయంపై భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పలు కారణాలు పంచుకున్నాడు.

Virat Kohli: 10వ సారి అదే తప్పు.. ఒకేలా ఔటవుతోన్న భారత సారథి.. సమస్యంతా అక్కడే ఉందంటోన్న మాజీలు..!
India Vs South Africa Virat Kohli
Follow us
Venkata Chari

| Edited By: Phani CH

Updated on: Dec 30, 2021 | 9:28 AM

Virat Kohli: సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ ఏడాది 10వ సారి ఇలా ఓవర్సీస్ పిచ్‌లపై పెవిలియన్ చేరాడు. కోహ్లీ ఎందుకు నిరంతరం ఇలా విఫలమవుతున్నాడు.. ఇదే విషయంపై భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పలు కారణాలు పంచుకున్నాడు. అతని కంటే ముందు సునీల్ గవాస్కర్ కూడా కోహ్లీకి ఫుట్ వర్క్ లేని విషయాన్ని బయటపెట్టాడు.

రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచిన కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులు చేసిన విరాట్ రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచాడు. నాల్గవ రోజు లంచ్ తర్వాత, మార్కో జెన్సన్ వేసిన మొదటి బంతికే వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్‌కి కోహ్లీ క్యాచ్ ఇచ్చాడు. కోహ్లి 32 బంతుల్లో 18 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి 94 బంతుల్లో 35 పరుగులు చేశాడు. అంటే దాదాపు క్రీజులో సెట్ అయ్యాడు. అయితే అతను లుంగీ ఎంగిడి అవుట్‌గోయింగ్ బంతిని ఆడి సెకండ్ స్లిప్‌లో ఫీల్డర్‌కు చిక్కాడు. ఎంగిడి 8 బంతుల్లో అతడిని ట్రాప్ చేశాడు.

కోహ్లీ ఎక్కడ తప్పు చేస్తున్నాడంటే.. 1. సెట్ అయిన తర్వాత వికెట్ కోల్పోవడం.. కోహ్లీ చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడని, బాగా ఆడుతున్నాడని బంగర్ చెప్పుకొచ్చాడు. ఇంత సేపు క్రీజులో ఉండి భారీ స్కోరు చేస్తాడని అంతా అనుకున్నా.. గతం మాదిరే తప్పులు చేస్తూ వికెట్ పడగొట్టుకుంటున్నాడు. ఆఫ్-స్టంప్ వెలుపల చాలా దూరం ఫ్రంట్ ఫుట్‌లో బంతిని ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు.

2. సీమింగ్ కండిషన్‌లో ఫ్రంట్ ఫుట్‌పై ఎక్కువ నమ్మకం మంచిది కాదు.. ఒక స్పోర్ట్స్ ఛానెల్‌తో జరిగిన సంభాషణలో బంగర్ మాట్లాడుతూ, భారత కెప్టెన్ ఫ్రంట్ ఫుట్‌లో ఆడటానికి ఇష్టపడతాడు. అతను తన పాదాలను ముందుకు కదిలించి ఆడేందుకు ఇష్టపడుతుంటాడు. వెనుక పాదాన్ని అస్సలు ఉపయోగించడు. పిచ్‌పై ఫ్రంట్ ఫుట్‌ ఉపయోగించడం అంత క్షేమకరం కాదు. ఆఫ్రికన్ పిచ్‌లపై అస్సలు ఇలా ఆడొద్దు. బ్యాక్ ఫుట్‌లో వెళ్లి ఆడాలి. అలా చేస్తే పెద్ద స్కోరు చేయగలడంటూ బంగర్ చెప్పుకొచ్చాడు.

3. కోహ్లీ ఓపికతో ఆడాలి.. ఫ్రంట్ ఫుట్‌లో ఆడితే, బౌలర్ బంతులను బయట విసేరేందుకు ఇష్టపడతాడు. అలాంటి సమయంలో బంతి బయటి అంచుని తీసుకొని వికెట్ కీపర్ లేదా స్లిప్‌కు వెళుతుందని బంగర్ పేర్కొన్నాడు. అటువంటి పరిస్థితిలో, బ్యాట్స్‌మన్ తన వికెట్ కోల్పోవాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికాలో తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి సహనం ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అతనితో పోలిస్తే రాహుల్ చాలా ఓపికగా ఆడి భారీ స్కోర్ చేయగలిగాడు.

ఈ ఏడాది ఆగస్టులో ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లి బయటి బంతులను ఆడుతూ క్యాచ్‌లకు బలయ్యాడు. ఇదే విషయంపై గవాస్కర్ భారత సారథి ఫుట్ వర్క్ లోపాన్ని ఎత్తి చూపాడు. ఫ్రంట్ ఫుట్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. కోహ్లీ బ్యాటింగ్ లోపాల గురించి సచిన్ టెండూల్కర్‌తో కూడా మాట్లాడాలని సూచించాడు.

దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు 8 సార్లు ఇలా.. కోహ్లి ఈ ఏడాది దక్షిణాఫ్రికా కంటే ముందు 8 సార్లు ఆఫ్-స్టంప్‌లో ఔట్ అయ్యాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో, స్టంప్‌లకు దూరంగా వెళ్తున్న బంతిని బ్యాక్ ఫుట్‌తో ఆడే ప్రయత్నంలో వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. అదే సమయంలో ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో నాటింగ్‌హామ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో జేమ్స్ అండర్సన్ వేసిన ఔట్‌గోయింగ్ బంతిని కొట్టే ప్రయత్నంలో వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతికి చిక్కాడు కోహ్లీ.

లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్‌లో ఆలీ, రాబిన్సన్ వేసిన ఔట్‌గోయింగ్ బంతికి స్లిప్‌లో జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే సమయంలో రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ అదే తప్పును పునరావృతం చేసి సామ్ కరెన్ అవుట్‌గోయింగ్ బంతికి వికెట్ కీపర్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు.

అదే సమయంలో, లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత, రాబిన్సన్ అవుట్‌గోయింగ్ బాల్‌ను ఆడే ప్రయత్నంలో ఫస్ట్ స్లిప్‌లో క్యాచ్‌కి ఔటయ్యాడు. ఓవల్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లి ఇలానే పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్‌లో రాబిన్సన్ వికెట్ వెనుక క్యాచ్ ఇచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో అలీ వేసిన ఔట్‌గోయింగ్ బాల్‌లో స్లిప్‌లో మోయిన్‌ క్యాచ్‌ ఔటయ్యాడు.

2019 నుంచి సెంచరీ కూడా చేయలే.. కోహ్లీ 2019 నుంచి సెంచరీ చేయలేకపోయాడు. చివరిసారిగా 2019లో కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో జరిగిన డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. అప్పటి నుంచి దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా అతని బ్యాట్‌ నుంచి సెంచరీ నమోదు కాలేదు. దీంతో ప్రస్తుతం కోహ్లీ పేవలఫాంతో ఇబ్బంది పడుతున్నాడు. క్రీజులో ఎక్కువ సేపు ఉన్నా భారీ స్కోర్లు చేయడంలో మాత్రం విఫలమవుతున్నాడు.

Also Read: IND vs SA: చివరి రోజుకు చేరిన ఫలితం.. విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్.. విదేశాల్లో బుమ్రా స్పెషల్ రికార్డ్..!

IND vs SA: కోహ్లీ భయ్యా.. నువ్వెక్కడున్నా కింగే.. మైదానంలో మళ్లీ స్టెప్పులేసిన టీమిండియా కెప్టెన్‌.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..