Watch Video: స్వింగ్‌ బౌలింగ్‌ ముందు తేలిపోతున్న ఆ ఇద్దరు.. ధోని స్టూడెంట్‌ను రంగంలోకి దింపిన రాహుల్ ద్రవిడ్..!

IND vs SA: డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుండగా, రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో టీమిండియా తొలిపోరుకు సిద్ధమవుతోంది.

Watch Video: స్వింగ్‌ బౌలింగ్‌ ముందు తేలిపోతున్న ఆ ఇద్దరు.. ధోని స్టూడెంట్‌ను రంగంలోకి దింపిన రాహుల్ ద్రవిడ్..!
Rahul Dravid
Follow us

|

Updated on: Dec 21, 2021 | 6:22 PM

India Vs South Africa 2021: దక్షిణాఫ్రికాతో 3 టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. దక్షిణాఫ్రికా జట్టు స్వదేశంలో ఆడుతోంది. కాబట్టి సవాలు కఠినమైనది. అందుకే భారత జట్టు కూడా కఠినమైన ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉంది. సెంచూరియన్ టెస్ట్ కూడా టీమ్ ఇండియాకు కష్టంగా తయారైంది. ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్ బౌలర్లు ఎక్కువగా రాణిస్తుంటారు. టీమ్ ఇండియాలోని ముగ్గురు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడమే సమస్యలా మారింది. అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారా, టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ, 2020 నుంచి వీరి బ్యాట్ నిశ్శబ్దంగా మారింది.

అయితే ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను ఫాంలోకి తీసుకరావాలని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ నిర్ణయించుకున్నాడు. సెంచూరియన్‌లో ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లపై రాహుల్ ద్రవిడ్ ప్రత్యేక దృష్టి సారించాడు. మంగళవారం నాటి టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్‌లో చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కొంటున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.

దీపక్ చాహర్‌ని రంగంలోకి దింపిన ద్రవిడ్.. రహానే, పుజారా చాలా కాలంగా స్వింగ్ బౌలింగ్‌కు వ్యతిరేకంగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని, అందుకే రాహుల్ ద్రవిడ్ దానిని ఎదుర్కోవాలని కోరినట్లు తెలుస్తోంది. తన బలమైన స్వింగ్ బౌలింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌కు అనేక మ్యాచ్‌లను గెలిపించిన స్వింగ్ బౌలింగ్‌ స్పెషలిస్ట్ దీపక్ చాహర్ మద్దతును రాహుల్ ద్రవిడ్ తీసుకున్నాడు. దీపక్ చాహర్ నెట్ బౌలర్‌గా జట్టుతో దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. పుజారా, రహానెలను వారి స్వింగ్ బౌలింగ్‌తో పరీక్షించాడు. దీపర్ చాహర్ తన బౌలింగ్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పంచుకున్నాడు.

విరాట్ కోహ్లీ కూడా ద్రవిడ్ మార్గంలోనే.. పుజారా, రహానే కాకుండా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పరుగుల కోసం తహతహలాడుతున్నాడని తెలుస్తోంది. కోహ్లీ 2 సంవత్సరాలుగా అంతర్జాతీయ సెంచరీ సాధించలేదు. దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో ఈ కరువును ముగించాలని కోరుకుంటున్నాడు. ఇందుకోసం ద్రవిడ్‌తో విరాట్ కోహ్లీ చాలా సమయం గడుపుతున్నాడు. వీరిద్దరి వీడియోను కూడా బీసీసీఐ షేర్ చేసింది. దీంతో ద్రవిడ్ భారత టెస్ట్ కెప్టెన్‌కు ప్రత్యేక బ్యాటింగ్ చిట్కాలు ఇస్తున్నాడు.

Also Read: 83: ‘ఆనాటి భారత విజయం.. ప్రపంచ క్రికెట్ భవిష్యత్తుకు మేల్కొలుపు’

IND vs SA: దక్షిణాఫ్రికా టీంకు భారీ దెబ్బ.. టెస్ట్ సిరీస్‌ నుంచి ఈ తుఫాను బౌలర్ ఔట్..!

Latest Articles
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే
పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే