IND vs SA: దక్షిణాఫ్రికా టీంకు భారీ దెబ్బ.. టెస్ట్ సిరీస్‌ నుంచి ఈ తుఫాను బౌలర్ ఔట్..!

South Africa Cricket Team: భారత్‌తో సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఈ బౌలర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

IND vs SA: దక్షిణాఫ్రికా టీంకు భారీ దెబ్బ.. టెస్ట్ సిరీస్‌ నుంచి ఈ తుఫాను బౌలర్ ఔట్..!
India Vs South Africa Series 2021
Follow us
Venkata Chari

|

Updated on: Dec 21, 2021 | 5:28 PM

India Vs South Africa 2021: భారత్‌తో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బ్యాడ్ న్యూస్ ఎదురైంది. ఫాస్ట్ బౌలర్ ఎన్రిక్ నార్కియా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. గాయాలతో భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా ట్వీట్ ద్వారా తెలియజేసింది. చాలా కాలంగా కొనసాగుతున్న గాయం కారణంగా ఎన్రిక్ నార్కియా మూడు టెస్టుల సిరీస్‌లో ఆడలేడని పేర్కొంది. అతని స్థానంలో మరో ప్లేయర్‌ని తీసుకోలేదు. నిపుణుల నుంచి సలహాలు తీసుకుంటూ రికవరీపై దృష్టి సారించాలని చూస్తున్నాడు. డిసెంబర్ 26న భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

నార్కియా తప్పుకోవడంతో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ ధాటికి గట్టి దెబ్బ తగలనుంది. అతను గత కొంతకాలంగా జట్టులోని ప్రధాన ఆటగాళ్లలో ఒకడు. కగిసో రబడా, లుంగీ ఎన్‌గిడితో కలిసి ప్రోటీస్ జట్టు పేస్ అటాక్‌ను ధీటుగా ఎదుర్కొన్నాడు. గంటకు 150 కిలోమీటర్లకు పైగా బంతిని నిలకడగా విసిరే సామర్థ్యం నార్కియాకు ఉంది. దీంతో భారత బ్యాట్స్‌మెన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాలో బౌన్సీ బంతుల ముందు బోల్తా కొట్టిన చరిత్ర భారత్‌కు ఉంది. నార్కియా ఇప్పటి వరకు 12 టెస్టులు, 12 వన్డేలు, 16 టీ20లు ఆడాడు.

నార్కియా టెస్టు కెరీర్.. 2021లో నార్కియా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఐదు టెస్టుల్లో 20.76 సగటుతో 25 వికెట్లు తీశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 37.6గా ఉంది. అతను రెండుసార్లు ఐదు వికెట్లు తీసుకున్నాడు. 56 పరుగులకు ఆరు వికెట్లు అతని అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. 28 ఏళ్ల ఈ ఆటగాడు ఇప్పటివరకు 12 టెస్టులు ఆడాడు. ఇందులో 47 వికెట్లు తీశాడు. 2019లో భారత్‌తో పూణె టెస్టులో అరంగేట్రం చేశాడు. అతను ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో భారత్‌తో ఏ టెస్టు ఆడలేదు. ప్రస్తుత సిరీస్‌లో ఆడాల్సి వస్తే అతడి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.

నార్కియా ఇటీవల ఐపీఎల్ 2021లో ఆడిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగంగా ఉన్నాడు. ఈ జట్టు తరపున అద్భుతంగా రాణించాడు. దీంతో ఐపీఎల్ 2022కి ముందు ఢిల్లీ అతడిని రిటైన్ చేసుకుంది.

Also Read: 362 బంతుల్లో 148 పరుగులు.. 541 నిమిషాల సుధీర్ఘ బ్యాటింగ్.. 14 ఏళ్లుగా తిరుగులేని ద్రవిడ్ రికార్డుకు బ్రేకులు?

India vs South Africa: తొలి పర్యటనలో సత్తా చాటేందుకు సిద్ధం..ఫుల్ ఫాంతో బరిలోకి దిగనున్న 5గురు భారత ప్లేయర్లు..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే