IND vs SA 1st T20I: టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్ 11లో ఎవరున్నారంటే?

భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత ఇరు జట్లు తొలిసారి తలపడనున్నాయి.

IND vs SA 1st T20I: టాస్ ఓడిన భారత్.. ప్లేయింగ్ 11లో ఎవరున్నారంటే?
Ind Vs Sa 1st T20i Toss
Follow us
Venkata Chari

|

Updated on: Nov 08, 2024 | 8:23 PM

భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది. డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత ఇరు జట్లు తొలిసారి తలపడనున్నాయి.

భారత్ నుంచి ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లు, నలుగురు ఆల్ రౌండర్లు ఆడుతున్నారు.

ప్రపంచకప్ తర్వాత క్లాసన్, మిల్లర్ తొలిసారి రంగంలోకి..

టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత దక్షిణాఫ్రికా 6, భారత్ 12 టీ20లు ఆడాయి. దక్షిణాఫ్రికా 1 మ్యాచ్‌లో మాత్రమే గెలవగా, భారత్ 1 మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది. బార్బడోస్‌లో ఫైనల్‌ ఆడే జట్టు నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ ఈరోజు ఆడడం లేదు. మరోవైపు దక్షిణాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ ఫైనల్ తర్వాత తొలిసారి టీ20 ఆడుతున్నారు.

దక్షిణాఫ్రికాపై బలంగానే భారత్‌..

ఇరుజట్ల మధ్య ఇప్పటి వరకు 27 టీ-20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 15, దక్షిణాఫ్రికా 11 గెలిచాయి. కాగా, ఒక మ్యాచ్ అసంపూర్తిగా మిగిలిపోయింది. 2023లో టీ20 సిరీస్ కోసం భారత్ చివరిసారిగా దక్షిణాఫ్రికాలో పర్యటించింది. ఇక్కడ రెండు జట్లు 1-1తో సిరీస్‌ను డ్రా చేసుకున్నాయి. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దు చేశాకె. ఇరుజట్ల మధ్య ఇప్పటి వరకు 9 టీ-20 సిరీస్‌లు జరగ్గా అందులో భారత్ 4, దక్షిణాఫ్రికా 2 గెలిచాయి. కాగా 3 సిరీస్‌లు డ్రాగా మిగిలాయి.

ఇరు జట్లు:

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), ఐడెన్ మార్క్రామ్(c), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, పాట్రిక్ క్రుగర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబయోమ్జి పీటర్.

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..