Champions Trophy: బీసీసీఐ దెబ్బకు తలవంచిన పాక్.. హైబ్రిడ్ మోడ్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ?

ICC Champions Trophy 2025: ఫిబ్రవరి 2025లో పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనున్న ICC ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇంకా ప్రకటించబలేదు. భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లే అవకాశం లేదు. టోర్నమెంట్ హైబ్రిడ్ ఫార్మాట్‌లో (UAEలో భారత్ మ్యాచ్‌లు) నిర్వహించేందుకు పాక్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐసీసీ షెడ్యూల్ విడుదల చేయాలని పీసీబీ డిమాండ్ చేస్తుండడంతో నవంబర్ 11న షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

Venkata Chari

|

Updated on: Nov 08, 2024 | 7:51 PM

ఫిబ్రవరి 2025లో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే, ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ ఇంకా ప్రకటించలేదు. దీనికి తోడు ఈ ఐసీసీ టోర్నీలో పాల్గొనేందుకు టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనేది ఇంకా ఖచ్చితంగా తెలియలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్ ఇండియాను పంపేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది.

1 / 6
టీమిండియాను తమ దేశానికి ఆహ్వానించేందుకు పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే టీమ్ ఇండియా వస్తుందన్న ఆశతో భారత జట్టు మ్యాచ్ లను లాహోర్ లోనే నిర్వహించేందుకు పీసీబీ ముసాయిదా షెడ్యూల్ ను కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే భారత్ ముందు తలవంచిన పాకిస్థాన్.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌లో మార్పులు చేసేందుకు సిద్ధమైంది.

2 / 6
PTI నివేదిక ప్రకారం, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌లు UAEలో నిర్వహించేందుకు ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అంటే టోర్నీని హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. ఇంతకు ముందు 2023లో జరిగిన ఆసియా కప్ కూడా హైబ్రిడ్ మోడల్‌లోనే జరిగింది. ఆసియా కప్‌నకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చినప్పటికీ, టీమిండియా తన మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది.

3 / 6
ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించాలని పిసిబి ఆలోచిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. తమ జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు భారత ప్రభుత్వం అంగీకరించకపోతే.. దుబాయ్ లేదా షార్జాలో టీమ్ ఇండియా మ్యాచ్‌లు ఆడాలని ఆలోచిస్తోంది. దీంతో ఈ ఐసీసీ టోర్నీ షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేయాలని పీసీబీ నిర్ణయించింది.

4 / 6
నివేదిక ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ నవంబర్ 11 న ప్రకటించబనుంది. వాస్తవానికి వచ్చే వారంలోగా టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటించాలని ఐసీసీపై పీసీబీ ఒత్తిడి చేస్తోంది. మూలాల ప్రకారం, పిసిబి కొన్ని నెలల క్రితం ఐసిసితో ప్రాబబుల్ షెడ్యూల్‌ను చర్చించిందని, అదే షెడ్యూల్‌ను నవంబర్ 11 న ప్రకటించాలని డిమాండ్ చేసింది.

5 / 6
ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమ్ ఇండియాను పాకిస్థాన్‌కు పంపాలా వద్దా అనే విషయాన్ని నిర్ధారించేందుకు బీసీసీఐపై ఒత్తిడి తీసుకురావాలని పీసీబీ ఐసీసీని కోరినట్లు కూడా వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, భారత జట్టును పాకిస్థాన్‌కు పంపేందుకు తమ ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందా లేదా అనేది బీసీసీఐ లిఖితపూర్వకంగా ఇవ్వాలని పీసీబీ పట్టుబట్టినట్లు సమాచారం.

6 / 6
Follow us