INDW vs PAKW: సత్తా చాటిన భారత బౌలర్లు.. 108 పరుగులకే పాక్ ఆలౌట్..

India vs Pakistan, Women’s Asia Cup T20 2024: మహిళల ఆసియాకప్‌లో భాగంగా శ్రీలంకలోని దంబుల్లా వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌, పాకిస్థాన్‌ మధ్య రెండో మ్యాచ్‌ జరుగుతోంది. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 19.2 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా ముందు 109 పరుగుల టార్గెట్ నిలిచింది.

INDW vs PAKW: సత్తా చాటిన భారత బౌలర్లు.. 108 పరుగులకే పాక్ ఆలౌట్..
Indw Vs Pakw Score
Follow us
Venkata Chari

|

Updated on: Jul 19, 2024 | 9:13 PM

India vs Pakistan, Women’s Asia Cup T20 2024: మహిళల ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతోంది. భారత బౌలర్లు అద్భుతమైన బౌలింగ్‌తో పాక్ జట్టును 108 పరుగులకే కట్టడి చేశారు. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్ చెరో 2 వికెట్లు తీశారు. పాకిస్థాన్ తరఫున సిద్రా అమీన్ 25, తుబా హసన్, ఫాతిమా సనా తలో 22 పరుగులు చేశారు. ఇది కాకుండా ఏ బ్యాటర్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

మహిళల టీ20 ఆసియా కప్ జులై 19 నుంచి జులై 28 వరకు జరగనుంది. ఇందులో 8 జట్లు పాల్గొంటున్నాయి. వీటిలో భారత్, పాకిస్థాన్, నేపాల్, యూఏఈ, మలేషియా, థాయ్‌లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు చెందిన మహిళా జట్లు ఉన్నాయి.

భారత్-పాకిస్థాన్ హోరాహోరీ పోరులో మనదే పైచేయి..

భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన చివరి 5 మ్యాచ్‌లను పరిశీలిస్తే.. భారత జట్టు ఏకపక్షంగానే పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. పాకిస్థాన్‌ నాలుగుసార్లు ఓడింది. అదే సమయంలో, 2022 అక్టోబర్ 7న జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 13 పరుగుల తేడాతో భారత జట్టును ఓడించింది.

భారత మహిళల జట్టు ప్రాబబుల్ ప్లేయింగ్ 11:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, రిచా ఘోష్, డి. హేమలత, శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్, జెమినీ రోజర్స్, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్.

పాకిస్థాన్ మహిళల జట్టు ప్రాబబుల్ ప్లేయింగ్ 11

నిదా దార్ (కెప్టెన్), ఇలియా రియాజ్, తుబా హసన్, ఫాతిమా సనా, గుల్ ఫిరోజ్, ఇరామ్ జావేద్, సిద్రా అమీన్, నస్రా సంధు, సయ్యదా అరుబ్ షా, మునిబా అలీ, సాదియా ఇక్బాల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..