AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: భారత్ vs పాక్ మ్యాచ్ క్రేజ్ అట్లుంటది మరి.. ఒక్కసారిగా కుప్పకూలిన బుకింగ్ వెబ్‌సైట్..!

India vs Pakistan T20 World Cup 2026 Tickets: భారత్-పాక్ మ్యాచ్ టికెట్ల కోసం వెబ్‌సైట్ క్రాష్ అవ్వడం చూస్తుంటే, ఫిబ్రవరి 15న కొలంబో స్టేడియం అభిమానుల కోలాహలంతో నిండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. టికెట్లు దక్కించుకోలేకపోయిన వారు తదుపరి విడత అమ్మకాల కోసం ఎదురుచూడాల్సిందే.

IND vs PAK: భారత్ vs పాక్ మ్యాచ్ క్రేజ్ అట్లుంటది మరి.. ఒక్కసారిగా కుప్పకూలిన బుకింగ్ వెబ్‌సైట్..!
India Vs Pakistan T20 World Cup 2026 Tickets
Venkata Chari
|

Updated on: Jan 15, 2026 | 5:43 PM

Share

India vs Pakistan T20 World Cup Clash: క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్ వర్సెస్ పాకిస్థాన్ సమరానికి రంగం సిద్ధమవుతోంది. 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ టికెట్ల రెండో దశ అమ్మకాలు బుధవారం (జనవరి 14) సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే, చిరకాల ప్రత్యర్థుల మధ్య ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనున్న మ్యాచ్ టికెట్ల కోసం లక్షలాది మంది అభిమానులు ఒక్కసారిగా వెబ్‌సైట్‌పైకి రావడంతో సర్వర్లు మొరాయించాయి.

అమ్మకాలు ప్రారంభమైన నిమిషాల్లోనే..

అధికారిక టికెటింగ్ పార్టనర్ అయిన ‘బుక్ మై షో’ (BookMyShow) ద్వారా టికెట్లు అందుబాటులోకి రాగానే, ట్రాఫిక్ అనూహ్యంగా పెరిగిపోయింది. లక్షలాది మంది లాగిన్ అవ్వడానికి ప్రయత్నించడంతో కేవలం కొద్ది నిమిషాల్లోనే ప్లాట్‌ఫారమ్ క్రాష్ అయింది. చాలా మంది యూజర్లకు ట్రాన్సాక్షన్స్ విఫలమవ్వడం, ‘టెక్నికల్ ఎర్రర్’ అని రావడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.

టికెట్ల ధరలు: అభిమానులకు క్రీడలను మరింత చేరువ చేసేందుకు ఐసీసీ ఈసారి అతి తక్కువ ధరలకే టికెట్లను అందుబాటులోకి తెచ్చింది.

ఇవి కూడా చదవండి

భారత్‌లో: టికెట్ ధరలు కేవలం రూ. 100 నుంచి ప్రారంభం.

శ్రీలంకలో: టికెట్ ధరలు LKR 1000 నుంచి ప్రారంభం.

భారత్-పాక్ మ్యాచ్: ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు ప్రారంభ టికెట్ ధర సుమారు LKR 1500 (దాదాపు రూ. 430) గా నిర్ణయించారు.

భారత జట్టు షెడ్యూల్: భారత్ తన గ్రూప్-ఏ మ్యాచ్‌లను క్రింది షెడ్యూల్ ప్రకారం ఆడనుంది:

ఫిబ్రవరి 7: భారత్ vs యూఎస్ఏ (ముంబై)

ఫిబ్రవరి 12: భారత్ vs నమీబియా (ఢిల్లీ)

ఫిబ్రవరి 15: భారత్ vs పాకిస్థాన్ (కొలంబో)

ఫిబ్రవరి 18: భారత్ vs నెదర్లాండ్స్ (అహ్మదాబాద్)

మొత్తం 20 జట్లతో జరగనున్న ఈ మెగా ఈవెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంకలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో జరగనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

భారత్ vs పాక్ మ్యాచ్ క్రేజ్.. కుప్పకూలిన బుకింగ్ వెబ్‌సైట్
భారత్ vs పాక్ మ్యాచ్ క్రేజ్.. కుప్పకూలిన బుకింగ్ వెబ్‌సైట్
ఇవాళే OTTలోకి వచ్చిన రియల్ క్రైమ్ స్టోరీ.. IMDBలో టాప్ రేటింగ్
ఇవాళే OTTలోకి వచ్చిన రియల్ క్రైమ్ స్టోరీ.. IMDBలో టాప్ రేటింగ్
ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఈ రాశులవారికి అసలైన పండగ షురూ
ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఈ రాశులవారికి అసలైన పండగ షురూ
పెరుగు వర్సెస్‌ మజ్జిగ.. మీ ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా..?
పెరుగు వర్సెస్‌ మజ్జిగ.. మీ ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా..?
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
మీరు ఫోన్‌ కాల్స్‌ లిఫ్ట్‌ చేస్తున్నారా? ఇక ఇవి తప్పక తెలుసుకోండి
మీరు ఫోన్‌ కాల్స్‌ లిఫ్ట్‌ చేస్తున్నారా? ఇక ఇవి తప్పక తెలుసుకోండి
గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ఎల్లమ్మ గ్లింప్స్..
గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ఎల్లమ్మ గ్లింప్స్..
అరుదైన నల్ల జీడిపండ్లు ఎప్పుడైనా తిన్నారా? లెక్కలేనన్ని లాభాలు..!
అరుదైన నల్ల జీడిపండ్లు ఎప్పుడైనా తిన్నారా? లెక్కలేనన్ని లాభాలు..!
సూర్యవంశీకి దిమ్మతిరిగే షాక్.. తొలి మ్యాచ్‌లోనే క్లీన్ బౌల్డ్
సూర్యవంశీకి దిమ్మతిరిగే షాక్.. తొలి మ్యాచ్‌లోనే క్లీన్ బౌల్డ్
Chanakya Niti: మనిషికి అతిపెద్ద శత్రువు ఏదో తెలుసా?
Chanakya Niti: మనిషికి అతిపెద్ద శత్రువు ఏదో తెలుసా?