Asia Cup 2023, IND vs PAK: భారత్-పాకిస్థాన్ ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే.. 15 రోజుల్లో 3 సార్లు ఢీ..
Asia Cup 2023 Schedule: ఆగస్టు 30న జరిగే తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, నేపాల్ జట్లు తలపడనుండగా, ఈ మ్యాచ్ ముల్తాన్‌లో జరగనుంది.
Asia Cup 2023 Schedule: ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే ఈ ఆసియా కప్ హైబ్రిడ్ ఫార్మాట్‌లో జరగనుంది. అంటే 4 మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరిగితే, మిగిలిన మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. ముందుగా టోర్నీ మొత్తం పాకిస్థాన్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, పాక్‌లో టోర్నీ నిర్వహిస్తే భారత్ పాల్గొనదు. దీంతో టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించారు.
దీని ప్రకారం ఆగస్టు 30న జరిగే తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, నేపాల్ జట్లు తలపడనుండగా, ఈ మ్యాచ్ ముల్తాన్‌లో జరగనుంది. లంకలోని క్యాండీలో ఆగస్టు 31న జరిగే 2వ మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి.
సెప్టెంబరు 2న జరగనున్న మూడో మ్యాచ్‌తో టీమిండియా ఆసియాకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌కి ప్రత్యర్థి పాకిస్థాన్ కావడం విశేషం. అలాగే, ఈ మ్యాచ్‌కు క్యాండీ క్రికెట్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది.
భారత్-పాక్ పోరు 3 సార్లు..
సెప్టెంబరు 2న లీగ్ దశలో భారత్-పాకిస్థాన్ తలపడడం ఖాయం. లీగ్ మ్యాచ్‌ల అనంతరం పాకిస్థాన్, టీమిండియా సూపర్-4 దశకు చేరుకుంటే సెప్టెంబర్ 10న మరోసారి తలపడతాయి.
సూపర్-4 దశలో కూడా రెండు జట్లు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలను ఆక్రమిస్తే ఫైనల్‌లోకి ప్రవేశిస్తాయి. దీని ప్రకారం సెప్టెంబర్ 17న మూడో ఎన్ కౌంటర్ జరగవచ్చు.
దీని ప్రకారం కేవలం 15 రోజుల్లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మూడు హైవోల్టేజీ మ్యాచ్‌లను చూసే అవకాశం క్రికెట్ ప్రేమికులకు లభిస్తుందో లేదో చూడాలి.
ఆసియా కప్ భారత్ షెడ్యూల్..
సెప్టెంబరు 2- భారత్ vs పాకిస్థాన్ (కాండీ)
సెప్టెంబర్ 4- భారత్ vs నేపాల్ (కాండీ)
సెప్టెంబర్ 6 నుంచి 15 వరకు సూపర్-4 మ్యాచ్‌లు
సెప్టెంబర్ 17- ఫైనల్ (కొలంబో)
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..